Advertisementt

చిరు vs బాలయ్య ఎవ్వరూ తగ్గడం లేదు

Wed 21st Dec 2022 11:36 AM
veera simha reddy,waltair veerayya  చిరు vs బాలయ్య ఎవ్వరూ తగ్గడం లేదు
Chiru vs Balayya చిరు vs బాలయ్య ఎవ్వరూ తగ్గడం లేదు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి-నటసింహ బాలకృష్ణ ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి కళ్ళు వీరిపైనే, ఫాన్స్ అయితే చెప్పక్కర్లేదు. మెగా vs నందమూరి ఫాన్స్ అన్న రేంజ్ లో సోషల్ మీడియాలో పోటీ పడుతున్నారు. కుర్ర హీరోలంతా సైలెంట్ గా ఉంటే.. సీనియర్ హీరోలైన చిరు మరియు బాలయ్యలు సంక్రాంతికి పోటీ పడుతున్నారు. వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ చూసి మిగతా ప్రేక్షలు ఎంజాయ్ చేస్తున్నారు. వారు మాత్రం పోటాపోటీ ప్రమోషన్స్ తో హంగామా చేస్తున్నారు. చిరు నుండి బాస్ పార్టీ వచ్చిన గంటల్లోనే జై బాలయ్య ఎంతమ్ వచ్చేసింది. బాలయ్య నటిస్తున్న వీరసింహ రెడ్డి నుండి శృతి హాసన్ తో డ్యూయెట్ రాగానే.. చిరు నుండి శృతి హాసన్ తో శ్రీదేవి సాంగ్ వచ్చేసింది.

రెండు సాంగ్స్ లో మెగాస్టార్, బాలయ్యలు స్టైలిష్ గా కనిపించగా.. హీరోయిన్ శృతి హాసన్ మాత్రం రెండు సాంగ్స్ లో గ్లామర్ షో తో ఇద్దరి హీరోలతో కలిసి దుమ్ము రేపింది. అటు బాలయ్య ఇటు ఎవ్వరూ తగ్గేదేలే అంటూ డాన్స్ లతో కుమ్మేస్తున్నారు. మధ్యలో స్పెషల్ అట్రాక్షన్ మాత్రం శృతి హాసన్ అని చెప్పాలి. ఇప్పుడు బాలయ్య నుండి మరో స్పషల్ సాంగ్ రాబోతుంది. అది మా బావ మనోభావాలు అంటూ డిసెంబర్ 24 న బాలయ్య కొత్తగా స్పెషల్ గా దిగిపోవడానికి రెడీ అయ్యారు.

మరి దీని వెనకే చిరువాల్తేర్ వీరయ్య నుండి కొత్త సాంగ్ వచ్చేస్తుందిలే. అయితే బాలయ్య-చిరు నుండి వచ్చిన డ్యూయెట్స్ లో లిరిక్స్, మ్యూజిక్ కొత్తగా లేకపోయినా చిరంజీవి, బాలయ్య ల డాన్స్ స్టెప్స్ అలాగే వాళ్ళ లుక్స్ కి ఫాన్స్ ఫిదా అయ్యారు. జనవరి 12 న బాలకృష్ణ వీర సింహ రెడ్డి, జనవరి 13 న చిరు వాల్తేర్ వీరయ్యలతో బాక్సాఫీసు దగ్గర జాతరే అన్నమాట.

Chiru vs Balayya:

Veera Simha reddy vs Waltair Veerayya 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ