మెగా ఫ్యామిలిలో ఇప్పుడు ఉత్సాహం, సంతోషం వెల్లువిరుస్తుంది. కారణం చిరంజీవి తాత కాబోతున్నారు. రామ్ చరణ్ మెగా ఫ్యామిలీకి వారసుడిని ఇవ్వబోతున్నాడు. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుండి మెగా ఫాన్స్ లో పండగ వాతావరణం కనబడుతుంది. ఉపాసన సరోగసి ద్వారా తల్లికాబోతుంది అనే ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ ఆమె బేబీ బంప్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ అంతా సెలెబ్రేషన్స్ మూడ్ లోకి వెళ్ళిపోయింది.
అయితే ప్రతి ఏడు మెగా ఫ్యామిలిలో క్రిష్ట్మస్ సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరుగుతాయి. మెగా కజిన్స్ అంతా ఈ వేడుకల్లో ఆడి పాడి పార్టీ చేసుకుంటారు. అల్లు అర్జున్ దగ్గర నుండి, అతని భార్య స్నేహ, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, శిరీష్, శ్రీజ, సుశ్మిత, నిహారిక, సాయి తేజ్, వైష్ణవ తేజ్ ఇలా మెగా ఫ్యామిలిలో యూత్ మొత్తం క్రిష్ట్మస్ పార్టీ ని ఎంజాయ్ చేస్తారు. మరి ఈ ఏడాది రామ్ చరణ్ -ఉపాసన తల్లితండ్రులు కాబోతుండడం, ఇటు క్రిష్ట్మస్ ని మెగా ఫ్యామిలిలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే క్రిష్ట్మస్ పార్టీని ఎప్పుడూ రామ్ చరణ్-ఉపాసన దంపతులు హోస్ట్ చేసేవారు.
ఉపాసన మెగా ఫ్యామిలీ కజిన్స్ అంటూ మెగా పిక్ ని సోషల్ మీడియా లో షేర్ చెయ్యగానే ఇట్టే వైరల్ అయ్యింది. మెగా ఫ్యామిలీ యంగ్ బాచ్ మొత్తం ఈ ఫ్రేమ్ లో కనిపించింది. ఇప్పటికే సంతోషంగా ఉన్న మెగా ఫ్యామిలీకి క్రిష్ట్మస్ సెలెబ్రేషన్స్ మరింత సంతోషాన్ని నింపింది.