మెగాస్టార్ చిరు రాజకీయాల్లోకి వచ్చి దణ్ణం పెట్టేసి సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవల మీద కాళ్ళేసారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా 2024 ఎన్నికల కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నాడని ఆ టైటిల్ చూసి అనుకుంటున్నారేమో.. రామ్ చరణ్ కి ఎలక్షన్స్ కి ఎలాంటి సంబంధం లేదు కానీ.. ఆయన దర్శకుడు శంకర్ తో తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ లో చేస్తున్న RC 15 కొత్త షెడ్యూల్ కోసం ఓ పొలిటికల్ మీటింగ్ పెట్టబోతున్నాడు. డిసెంబర్ 22 నుండి కొవ్వూరు, రాజమండ్రి దగ్గర గోదావరి మధ్యన ఉన్న దీవుల్లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసారు శంకర్.
ఇప్పటివరకు వైజాగ్, అమృతసర్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్స్ చేసిన శంకర్ ఇప్పుడు కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాలకి వెళుతున్నారు. అక్కడ గోదావరి మధ్యన దీవుల్లో వేసిన ప్రత్యేక సెట్స్ లో వందలాదిమంది జూనియర్ ఆర్టిస్ట్ ల మధ్యన రామ్ చరణ్ ఎలక్షన్ మీటింగ్ పెట్టబోతున్నాడట. ఈ షెడ్యూల్ సినిమాకి చాలా కీలకమని తెలుస్తుంది. RC 15 లో రామ్ చరణ్ కి ఎస్ జె సూర్య విలన్ గా పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే రెండు రోజులుగా మలయాళ క్రేజీ హీరో మోహన్ లాల్ RC15 లో సీఎం కేరెక్టర్ చేస్తున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ విషయమై టీమ్ నుండి ఎలాంటి సమాచారం లేదు.