పవన్ కళ్యాణ్ కి కమెడియన్ అలీ కి మధ్యలో చెడింది.. కాబట్టే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల్లో అలీ కనిపించడం లేదు, అలీ కూతురు పెళ్ళికి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు, రాజకీయాల్లోకి వచ్చాక ఈ మిత్రులిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోయారంటూ ఏవేవో వార్తలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా అలీ కూతురు పెళ్ళికి పవన్ రాకపోవడంపై నెటిజెన్స్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్ని మనస్పర్థలు ఉన్నా పవన్ కళ్యాణ్ స్నేహితుడి కూతురు పెళ్ళికి రావాల్సింది అన్నారు. తాజాగా అలీ పవన్ కళ్యాణ్ కి తనకి మధ్యన వచ్చిన డిస్టెన్స్ ని మీడియానే క్రియేట్ చేసింది, మా మధ్యన ఎలాంటి మనస్పర్ధలు లేవని తేల్చేసాడు.
రీసెంట్ గా అలీ తో సరదాగా ప్రోగ్రాంలో సుమ యాంకరింగ్ లో అలీ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లో అలీ పవన్ తో పంచాయతీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. పవన్ కి తనకి ఎలాంటి గ్యాప్ రాలేదని, కొన్ని వెబ్ సైట్స్ కావాలనే పనిగట్టుకుని మా మధ్యన గ్యాప్ సృష్టించాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాకుండా మా అమ్మాయి ఫాతిమా పెళ్ళికి పవన్ ని ఆహ్వానించడానికి హరి హర వీరమల్లు సెట్స్ కి వెళ్ళాను. అక్కడికి నేను వచ్చాను అని తెలియగానే పవన్ నా దగ్గరకి వచ్చారు.
నేను వెళ్ళిన సమయంలో వేరొకరు వచ్చినా వారిని వెయిటింగ్ లో పెట్టి నాతో 15 నిముషాలు మట్లాడారు. మేము ఏం మాట్లాడుకున్నామనే విషయం సో కాల్డ్ వెబ్ సైట్స్ కి తెలియదు. కానీ పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తారు. నా కూతురు పెళ్ళికి వస్తాను అన్న పవన్ కళ్యాణ్ కి అనుకోకుండా ఫ్లైట్ మిస్ అయ్యింది. ఆయన సెక్యూరిటీ అంతకుముందే రోడ్ మ్యాప్ చూసుకుని వెళ్లారు. అంతేకాని మా మధ్యన ఎలాంటి గ్యాప్ లేదు, అసలు విషయం తెలియకుండా అసత్యాలు రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అలీ మండిపడ్డారు.