కార్తికేయ2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ సిద్దార్థ్ ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ తో కలిసి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ 2 ని హిందీలో రిలీజ్ చేసి అక్కడ కోట్లు కొల్లగొట్టిన నిఖిల్ తాజా చిత్రం 18 పేజెస్ పై కూడా అంచనాలు బావున్నాయి. నిఖిల్-అనుపమ కలిసి కార్తికేయ 2 సక్సెస్ లో భాగమయ్యారు. మరి ఈ హిట్ పెయిర్ ఇప్పుడు 18 పేజెస్ తో కూడా హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటారా అనేది అందరిలో మొదలైన ఆసక్తి.
సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని నిఖిల్-అనుపమలు తెగ ప్రమోట్ చేస్తూ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం, విడుదల కాబోయే ఈ రెండు రోజుల్లోనే బస్ యాత్ర అంటూ హడావిడి చెయ్యడం వంటి విషయాలతో 18 పేజెస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. హిట్ పెయిర్ గా నిఖిల్-అనుపమలు క్రేజీగా 18 పేజెస్ ని ప్రమోట్ చేస్తున్నారు.
కార్తికేయ 2 తో తిరుగులేని హిట్ అందుకున్న వీరిద్దరూ 18 పేజెస్ తో కూడా హిట్ కొట్టి కార్తికేయ 2 విజయాన్ని రిపీట్ చెయ్యాలని కోరుకుందాం.