Advertisementt

పుష్ప 2 నుండి క్రేజీ అప్ డేట్

Tue 20th Dec 2022 11:39 AM
pushpa 2 movie,allu arjun,sukumar  పుష్ప 2 నుండి క్రేజీ అప్ డేట్
Crazy update on Pushpa 2 పుష్ప 2 నుండి క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి డిసెంబర్ 17 కి ఏడాది పూర్తయ్యింది. ఖచ్చితంగా ఏడాది తర్వాత పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టింది చిత్ర బృందం. దర్శకుడు సుకుమార్ మిగతా టెక్నీకల్ టీమ్ పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ అయినప్పటికీ అల్లు అర్జున్ ఇప్పటివరకు పుష్ప 2 సెట్స్ మీదకి వెళ్లలేదనే అనుకున్నారు. రీసెంట్ గానే పుష్ప ని రష్యాలో విడుదల చేసి అక్కడ ప్రమోట్ చేసిన టీమ్ డిసెంబర్ 17 న పుష్ప 1 విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్, దేవిశ్రీ కలిసి ఉన్న స్పెషల్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఇక అల్లు అర్జున్ పుష్ప ద రూల్ షూట్ లో ఓ ఐదు రోజుల పాటు పాల్గొన్నట్టుగా సుకుమార్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన నిఖిల్ 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ లు పుష్ప 2 పై ఇలా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. పుష్ప రాజ్ కి సంబందించిన ప్రతి డీటెయిల్ పట్టుకుని అల్లు అర్జున్ సూపర్ గా చేస్తున్నారు అంటూ సుకుమార్ చెప్పడంతో అల్లు ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు. 

ఇప్పటివరకు పుష్ప పార్ట్ 2 షూట్ లో అల్లు అర్జున్ పాల్గొనలేదు అనుకుంటున్నవారికి సుకుమార్ ఇచ్చిన సూపర్ అప్ డేట్ బూస్ట్ లా మారింది. ఇక తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

Crazy update on Pushpa 2:

Pushpa 2 shooting update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ