హీరో విశాల్ ప్రస్తుతం లాఠీ మూవీ ని రిలీజ్ కి సిద్ధం చేస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. తెలుగు, తమిళ్ లో డిసెంబర్ 22 న న లాఠీ మూవీ విడుదల కాబోతుంది. నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన విశాల్ సాయంత్రానికి తిరుపతిలో జరిగిన లాఠీ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అయితే గతంలో విశాల్ వైసిపి పార్టీ నుండి కుప్పంలో ఎమ్యెల్యేగా పోటీ చేస్తాడనే టాక్ నడిచినా.. ఆ వార్తలని విశాల్ కొట్టిపారేశాడు. తాజాగా విశాల్ ఏపీ సీఎం జగన్ ని భేటీ కావడానికి అమరావతి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే జగన్ తో భేటీ కావడానికి ప్రత్యేకమైన కారణాలు లేవని, తనకి సీఎం జగన్ అంటే ఇష్టమని, ఐ లవ్ సీఎం జగన్. జగన్ అంటే గుండెల్లో నుండి ఇష్టం వస్తుంది. నేను ఓటు వేయాల్సి వస్తే జగన్ కే వేస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు విశాల్. జగన్ తో రాజకీయపరమైన భేటీ కాదని, క్యాజువల్ గా కలుస్తున్నాను అని చెప్పిన విశాల్ ని ఎన్నికల్లో అవకాశం వస్తే ఎమ్యెల్యేగా పోటీ చేస్తారా అని అడిగిన మీడియా ప్రశ్నకి విశాల్ మట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ఇంట్రస్ట్ అయితే లేదు. ఒక ఎమ్యెల్యే ఎంత సంపాదిస్తున్నాడో తాను సినిమాల్లో అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను అని, అందుకే ఇప్పట్లో పాలిటిక్స్ లోకి వెళ్లే ఆసక్తి లేదని తేల్చేసాడు విశాల్.
అయితే లాఠీ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగానే విశాల్ జగన్ తో భేటీ అయినప్పటికీ.. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతని సంతరించుకుంది.