ట్రిపుల్ ఆర్ ని జపాన్ లో రిలీజ్ చెయ్యడానికి రాజమౌళి అండ్ హీరోలు వైఫ్ లు లతో సహా జపాన్ లో వాలిపోయి అక్కడ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ చేపట్టి రిలీజ్ చేసారు. రాజమౌళి ఏ టార్గెట్ తో అక్కడ రిలీజ్ చేసారో ఆ టార్గెట్ రీచ్ అవడమే కాదు జపాన్ లో ట్రిపుల్ ఆర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చూసిన పుష్ప బ్యాచ్ పుష్ప ని రష్యాలో రిలీజ్ చేసేందుకు రష్యా ఫ్లైట్ ఎక్కారు. ఇక్కడ పాన్ ఇండియా హిట్ అయిన పుష్ప1 రష్యాలో కూడా ఇరగదియ్యడం ఖాయమంటూ అక్కడ రిలీజ్ చేసేందుకు హీరో అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ రష్యా వెళ్లి సినిమాని ప్రమోట్ చేసి అక్కడ డిసెంబర్ 8న రిలీజ్ చేసారు.
రిలీజ్ కి ముందు ఉన్న పుష్ప హడావిడి రష్యాలో రిలీజ్ తర్వాత ఏ మాత్రం కనిపించలేదు. జపాన్ లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయినప్పుడు అక్కడి కలెక్షన్స్ గురించిన వార్తలు నిత్యంలో సోషల్ మీడియాలో వినిపించేవి, మీడియాలో కనిపించేవి. కానీ రష్యాలో పుష్ప1 విడుదల తర్వాత ఒక్క న్యూస్ కూడా లేదు. ఇంక కలెక్షన్స్ విషయం ఎలా తెలుస్తుంది. కానీ రష్యాలో పుష్ప అట్టర్ ప్లాప్ షోగా మిగిలిపోయింది అని అక్కడి కలెక్షన్స్ చూస్తుంటే అర్ధమవుతుంది.
అందుకే పుష్ప టీమ్ కూడా రష్యాలో సినిమా రిలీజ్ తర్వాత ఏం మాట్లాడకుండా కామ్ గా సౌండ్ లేకుండా ఉండిపోయింది. లేదంటే రష్యాలో పుష్ప ప్రభంజనం, కలెక్షన్స్ రికార్డ్స్ మోత అంటూ ఏవేవో కథనాలు ప్రచారంలోకి వచ్చేసేవి.