పెళ్లి సందD సినిమాలో క్యూట్ లుక్స్ తో, అదిరిపోయే అందాలతో ట్రెడిషనల్ గా అచ్చ తెలుగమ్మాయిలా ఆడియన్స్ ని ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ శ్రీలీల కి పెళ్లి సందD హిట్ ఇవ్వకపోయినా.. టాలీవుడ్ లో మాత్రం క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పెళ్లి సందD రిజల్ట్ తో సంబంధం లేకుండా శ్రీలీల కి అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. యంగ్ హీరోల ఛాన్స్ లతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న శ్రీలీల రేంజ్ ఇప్పటికే కోటి దాటేసింది.
ఇప్పుడు ధమాకాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న శ్రీలీల కి ఆ సినిమా గనక హిట్ అయ్యింది అంటే అమ్మడిని పట్టుకోవడం కూడా కష్టమే. ఇప్పటికే అమ్మడి రేంజ్ మాములుగా లేదు. రవితేజ తర్వాత నితిన్ తో మరో సినిమా చేస్తుంది. ఇక ధమాకా హిట్ కొడితే యంగ్ హీరోల సినిమాలన్ని శ్రీలీల అకౌంట్ లోనే. ఈ రకంగా మరో లక్కీ బ్యూటీ కృతి శెట్టికి శ్రీలీల చెక్ పెట్టినా పెట్టేస్తుంది.
మరి ధమాకాలో క్యూట్ గా స్వీట్ గా సారీస్, లంగావోణీ, మోడరన్ డ్రెస్ లతో మెస్మరైజ్ చెయ్యడానికి రెడీగా ఉంది. ధమాకా ప్రమోషన్స్ లోను అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో అదరగొట్టేస్తున్న ఆమెకి ధమాకా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ లక్కీ బ్యూటీ లక్ మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.