రకుల్ ప్రీత్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా హిందీకి, తమిళ్ కి దగ్గరగా ఉంటుంది. తెలుగులో సినిమాలకి డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్ కి డ్రగ్స్ కేసులో రెండోసారి నోటీసులు అందడం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కున్న రకుల్ ప్రీత్ కి మరోమారు మనీ లాండరింగ్ అలాగే డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం నిజంగా చర్చనీయాంశమైంది. అయితే ఇవేమి పట్టించుకొని రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నిత్యం ఫోటో షూట్స్ షేర్ చేస్తూనే ఉంటుంది.
ఒకసారి సల్వార్ కమీజ్ లో ఒంటినిండా డ్రెస్ తో కనబడితే ఒకసారి సన్ కిస్సేడ్ అంటూ ఎండలో ఫొటోస్ ని పోస్ట్ చేస్తుంది. మరోసారి గ్లామర్ గా మారిపోయి అందాలు ఆరబోసేస్తుంది. ఈ రోజు సోమవారం రకుల్ ప్రీత్ సీఒంగ్ బ్లాక్ డ్రెస్ అలాగే వైట్ కోట్ డ్రెస్ లలో ఉన్న ఫోటో షూట్ ని పోస్ట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ ని చూస్తుంటే ఇంత అందాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదేమిటో అంటారు. దర్శకనిర్మాతలు రకుల్ పై ఓ లుక్కెయ్యండి సామీ అని రిక్వెస్ట్ చేస్తారు.
అయితే గ్లామర్ పరంగా రకుల్ వేరే లెవల్ చూపిస్తున్నా ఆమె మాత్రం బరువు తగ్గి మరీ సన్నగా కనిపించడం కొందరికి నచ్చడం లేదు. రకుల్ కాస్త బరువు పెరిగితే ఆమె బ్యూటీ ఆటోమాటిక్ గా చేంజ్ అవుతుంది. కానీ రకుల్ ఫిట్ నెస్ మీద పెట్టే దృష్టి అందాలు పెంచడంపై పెట్టడం లేదే..