బిగ్ బాస్ కి హోస్ట్ గా నాగార్జున కి మొహం మొత్తేసింది అనే టాక్ నడుస్తుంది. నాగార్జున కి బిగ్ బాస్ బోర్ కొట్టింది అని ఒకరు అంటుంటే.. అంత రెమ్యునరేషన్ వస్తుంటే బిగ్ బాస్ ఎవరు వదులుకుంటారు బాస్ అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా నాగార్జున నేను ఉండను అని చెప్పేసినట్లుగా తెలుస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యంపై నాగార్జున గుర్రుగా ఉన్నారంటున్నారు. కారణం బిగ్ బాస్ లీకులు చిరాకు పుట్టిస్తున్నాయి. వాటిని ఆపడంలో యాజమాన్యం విఫలమైంది అంటూ నాగార్జున వారిపై ఆగ్రహంగా ఉండడం, అలాగే సీజన్ 6 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని పంపేసినప్పుడు నాగ్ పై వచ్చిన ట్రోలింగ్ కి ఆయనకి చిరాకు తెప్పించింది అంటున్నారు.
ముఖ్యంగా ఇనాయ ఎలిమినేషన్ విషయంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల ఇనాయ ఫాన్స్ మాత్రమే కాదు, నెటిజెన్స్ కూడా నాగార్జునపై ఫైర్ అవడంతో ఆ విషయంలోనూ నాగ్ హార్ట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానితో ఆయన సీజన్ 7 కి పని చెయ్యలేను అని చెప్పారని, అయితే నాగార్జున ప్లేస్ లోకి ఇప్పుడు మరో టాకింగ్ పవర్ ఉన్న హీరో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయనే బాహుబలి రానా. నెంబర్ వన్ యారి కి హోస్ట్ గా ఆకట్టుకుని రానా అయితే బిగ్ బాస్ స్టేజ్ పై బావుంటుంది అని అనుకుంటున్నారట. అటు రానా కూడా బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు రెడీగా ఉన్నారనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే రానా కొద్దిరోజులు ఏదో ఆపరేషన్ వలన సైలెంట్ కాబోతున్నాడట. ఆయన సినిమాలు కూడా చెయ్యడట.
అందుకే కొత్త ప్రాజెక్ట్ లు ఒప్పుకోవడం లేదట, కానీ అదయ్యాక బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తే మళ్ళీ ఆడియన్స్ ముందుకు రావొచ్చు, ఇది పెద్దగా స్ట్రెస్ లేని పని కావడంతో బిగ్ బాస్ హోస్ట్ గా రానా ఒప్పుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూద్దాం నాగ్ ప్లేస్ లో సీజన్ 7 కి రానా వస్తాడో లేదంటే నాగ్ కంటిన్యూ అవుతాడో అనేది.