Advertisementt

హైదరాబాద్ కి తిరిగొచ్చిన చిరు

Mon 19th Dec 2022 05:59 PM
chiranjeevi,shruti haasan,waltair veerayya  హైదరాబాద్ కి తిరిగొచ్చిన చిరు
Waltair Veerayya Second Single Unveiled హైదరాబాద్ కి తిరిగొచ్చిన చిరు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కలయికలో క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి వీరయ్య టీజర్, రవితేజ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాస్ పార్టీ సాంగ్ 28 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి మేకర్స్ విడుదల చేశారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీని వర్ణిస్తూ పాటను స్వయంగా రాసి  అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. జస్‌ప్రీత్ జాస్, సమీరా భరద్వాజ్‌ల డైనమిక్ వోకల్స్ తో ఎనర్జీని డబుల్ చేశారు. ఈ పాట ఆడియన్స్ మెస్మరైజ్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన గ్రేస్ ఫుల్ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. చిరంజీవి బ్లేజర్లు ధరించి స్టైలిష్‌గా ఉన్నారు. శృతి హాసన్ రంగురంగుల చీరలలో అద్భుతంగా ఉంది. వారి జంట చూడముచ్చటగా వుంది. మంచుతో కప్పబడిన లొకేషన్  మరొక హైలైట్. మౌత్ ఆర్గాన్ స్టెప్  సిగ్నేచర్ పాటకు మరో ఆకర్షణ. రాబోయే రోజుల్లో రీల్ మేకర్స్ కి ఇది ఫేవరెట్ అవుతుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్‌లు సమకూర్చారు.

ఈ సినిమా షూటింగ్ యూరప్‌లో పూర్తి  చేసుకొని చిరంజీవి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Waltair Veerayya Second Single Unveiled:

Waltair Veerayya Second Single Nuvvu Sridevi Nenu Chiranjeevi Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ