అభిమానులు తమ అభిమాన హీరోలు ఎప్పుడెప్పుడు సినిమాలతో సెట్స్ మీదకి వెళ్లి షూటింగ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. చాలామంది టాలీవుడ్ హీరోలు కొత్త సినిమాలు ప్రకటించినా సెట్స్ మీదకి వెళ్ళడానికి నెలలకు నెలలు టైం తీసుకుంటున్నారు. ఒక్క ప్రభాస్ మాత్రమే రెండు మూడు ప్రాజెక్ట్స్ షూటింగ్ చేసుకుంటూ హడావిడిగా వున్నాడు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వీలున్నప్పుడు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు తప్ప మిగిలిన మహేష్ కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ.. ఇలా స్టార్ హీరోలు ఎవరూ కొత్త సినిమాల సెట్స్ మీదకి వెళ్ళలేదు.
మహేష్ త్రివిక్రమ్ తో చెయ్యాల్సిన SSMB28 ప్రకటించి ఎనిమిది నెలలు అయ్యింది. సర్కారు వారి పాట హిట్ తర్వాత మహేష్ చాలా నెలలు టైమ్ వేస్ట్ చేసాడు. ఏదో ఓ షెడ్యూల్ చేసినా మళ్ళీ అది మొదటి నుండి మొదలు పెట్టాలంటున్నారు. ఇక ఎన్టీఆర్ అయితే చెప్పక్కర్లేదు.. కొరటాలతో NTR30 ప్రకటించి ఏడాది కావొస్తుంది. కానీ ఇప్పటివరకు అది ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. పుష్ప తో బిగ్గెట్స్ హిట్ కొట్టి పుష్ప 2 మొదలు పెట్టడానికి అల్లు అర్జున్ ఏడాది సమయం తీసుకున్నాడు.
2022 లో ఎన్టీఆర్, మహేష్ హిట్ కొట్టి సక్సెస్ జోష్ లో కొత్త సినిమాల సెట్స్ మీదకి వెళ్లకుండా ఖాళీగా ఉండడం ఫాన్స్ కి నచ్చలేదు. కానీ హీరోలు మాత్రం అభిమానుల ఆరాటం పట్టించుకోకుండా వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే అనేది అభిమానులు వెయిటింగ్ హీరోల వెనకడుగు అనేది.