హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈడీ నుండి రెండోసారి డ్రగ్స్ కేసులో నోటీసు లు వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. బిజెపి నేత పైలెట్ రోహిత్ రెడ్డి కి అలాగే రకుల్ ప్రీత్ కి ఒకేరోజు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసు లు ఇవ్వడం పై చాలారకాల ఊహాగానాలు నడిచాయి. అయితే ఈరోజు పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకావాల్సిందిగా అధికారులు డిసెంబర్ 19 తేదీ చెప్పగా.. రోహిత్ రెడ్డి తనకి ఈరోజు కుదరదని, అన్ని సబ్మిట్ చెయ్యడానికి టైమ్ కావాలంటూ ఓ లెటర్ పిఎ శ్రవణ్ కుమార్ తో ఈడి అధికారులకి పంపించాడు రోహిత్ రెడ్డి. ఈలోపు కేసీఆర్ తో రోహిత్ రెడ్డి భేటీ అయ్యాడు.
అదలా ఉండగా రకుల్ ప్రీత్ ఈడీ విచారణపై సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. కారణం తమకు ఈడీ అధికారుల నుండి ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్ ప్రీత్‌సింగ్ కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. మరోపక్క సుశాంత్ సింగ్ రాజపుట్ డ్రగ్స్ కేసులో గతంలో రకుల్ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరైన రకుల్ కి రెండోసారి నోటీసు లు ఇవ్వడంపై చర్చ మొదలు కాగా.. ఇప్పుడు ఆమె విచారణ మరింత సస్పెన్స్ క్రియేట్ చేసింది.