యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు NTR30 సెట్స్ మీదకి వెళతాడా అని ఆయన ఫాన్స్ వెయిట్ చేస్తున్న కొద్దీ ఆ ముహూర్తం ఇంకా ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఇదిగో అదిగో అంటూ మేకర్స్ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ముహూర్తానికి టైమ్ ఫిక్స్ చెయ్యడం లేదు. ఎప్పుడో నాలుగు నెలల క్రితమే మొదలు కావల్సిన NTR30 ఇప్పటికి మొదలు కాలేదు. కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటే ఎన్టీఆర్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా NTR30 కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది అనే బజ్ వినిపిస్తుంది.
జనవరి మొదటి వారంలో అని ముందు అనుకున్నా ఇప్పుడు NTR30 ముహూర్తం సంక్రాంతికి అంటున్నారు. సంక్రాంతికి పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలు పెట్టే యోచనలో టీమ్ ఉందట. కానీ అది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే కానీ మేము నమ్మలేమంటూ ఎన్టీఆర్ ఫాన్స్ గోల చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు కానీ, యువ సుధా వారు కానీ ఈ విషయంలో ఓ క్లారిటీ ఇస్తే ఫాన్స్ సంతోషపడతారు. లేదంటే వాళ్ళ గోల భరించడం కష్టమే.