బిగ్ బాస్ సీజన్ 6 లో సింగర్ రేవంత్ విన్నర్ గా నిలిచాడు. అసలైతే శ్రీహన్ విన్నర్ అవ్వాల్సింది కానీ.. అతను నాగార్జున ఇచ్చిన 40 లక్షల క్యాష్ కి ఆశపడి విన్నర్ ట్రోఫీని శ్రీహన్ వదులుకున్నాడు. సీజన్ మొదటి వారం నుండి సీజన్ చివరి వారం వరకు సింగర్ రేవంత్ ఓటింగ్ లో బుల్లితెర ప్రేక్షకుల మద్దతుతో స్ట్రాంగ్ గానే ఉన్నప్పటికీ.. అతని అగ్రెసివ్ నెస్ అలాగే మాట తీరు కొద్దిగా అతన్ని వెనక్కి నెట్టాయి. ఇక శ్రీహన్ ఆట పరంగా వ్యక్తిత్వం పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా బెస్ట్ అనిపించుకున్నప్పటికీ.. అతను కీర్తి, ఇనాయ విషయంలో చేసిన తప్పిదాలు కాస్త నెగెటివిటీని పెంచాయి.
దానితో టాప్ 2 లో కొనసాగిన శ్రీహన్ చివరి వారంలో అభిమానుల మద్దతుతో రేవంత్ కన్నా కొద్దిగా ఓట్స్ ఎక్కువ తెచ్చుకుని టాప్ వన్ లోకి వచ్చేసాడు. కానీ శ్రీహన్ నాగార్జున ఆఫర్ కి టెంప్ట్ అవడంతో ట్రోఫీ చేజారిపోయింది. అతి తక్కువ మార్జిన్ ఓటింగ్ తో టాప్ 1లో శ్రీహాన్, టాప్ 2 రేవంత్ ఉన్నారు. ఫ్రెండ్ గా విన్నర్, రన్నర్ వారిలోనే వుంది. కానీ విన్నర్ గా రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 ట్రోఫీ అందుకుని విజేతగా నిలిచాడు. 40 లక్షలు తీసుకుని టైటిల్ ను శ్రీహాన్ కోల్పోయాడు.
లేదంటే శ్రీహన్ అసలు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అన్నమాట. పాపం శ్రీహన్ 40 లక్షల కోసం టైటిల్ ని కోల్పోయాడు. నాగార్జునే స్టేజిపై శ్రీహన్ జస్ట్ చిన్న మార్జిన్ ఓట్స్ తో విన్నర్ అయ్యాడంటూ ప్రకటించగానే శ్రీహన్ మొహం వెలిగిపోయింది. అది ఓకె. కానీ విన్నర్ రేవంత్ కన్నా శ్రీహన్ కే ఎక్కువ గిట్టుబాటు అయ్యింది.