Advertisementt

క్లోజ్ అప్ లో చూస్తే కష్టమే రవి

Mon 19th Dec 2022 10:19 AM
ravi teja,dhamaka movie  క్లోజ్ అప్ లో చూస్తే కష్టమే రవి
Ravi Teja is difficult to see in close up shots క్లోజ్ అప్ లో చూస్తే కష్టమే రవి
Advertisement
Ads by CJ

రవితేజ ఎనర్జీకి మారుపేరు. మాస్ మహారాజ్ గా రవితేజ వరస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలను రిలీజ్ చేసేసిన రవితేజ ఇప్పుడు ధమాకాతో ఆడియన్స్ ముందుకురాబోతున్నాడు. అయితే రవితేజ ఫిట్ నెస్ కోసం జిమ్ చెయ్యడం వలనో లేదంటే ఏజ్ పెరగడం వలనో కానీ ఆయన ఫేస్ లో గ్లో మిస్ అవుతుంది. ఫేస్ ని క్లోజ్ అప్ లో చూస్తే బాబోయ్ రవితేజ అంటారు. 

ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ లో రవితేజ లుక్స్ విషయంలో చాలా మీమ్స్ పడ్డాయి. కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ధమాకా లోనూ రవితేజ క్లోజ్ అప్ లుక్ విషయంలో విమర్శలు మొదలయ్యాయి. చిన్న చిన్నగా కళ్ళు, దవడలు లోపలి వెళ్లిపోవడం ఇలా అన్నమాట. అదే వాల్తేర్ వీరయ్య రవితేజ ప్రోమోలో రవితేజ లుక్ లాంగ్ షాట్స్ లో అదిరిపోయాయనే చెప్పాలి. కానీ క్లోజ్ అప్ లుక్ విషయంలోనే రవితేజ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. క్లోజ్ అప్ లో అలా చూస్తే కష్టమే రవితేజ అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ చేస్తున్న కొత్త సినిమాల్లో అంటే రావణాసుర, టైగర్ నాగేశ్వరావులలో రవితేజ ఈ లుక్స్ విషయమై దృష్టి పెడితే బావుంటుంది అనే సలహాలు కూడా ఇస్తున్నారు. 

Ravi Teja is difficult to see in close up shots:

Ravi Teja Dhamaka releasing on Dec 23rd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ