జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసినా.. మళ్ళీ జబర్దస్త్ కి వెళ్లేందుకు మళ్ళీ దారులు వెతుక్కుంటున్నారు చాలామంది కమెడియన్స్. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్ళకి జబర్దస్త్ ఎన్ని కండిషన్స్ పెట్టినా రెడ్ కార్పెట్ పరిచేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంటుంది. అయితే చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్ వంటి వాళ్ళని యాజమాన్యం మళ్ళీ రానిచ్చే ప్రసక్తి లేదన్నట్టుగానే ఉంది. కానీ కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లకు మాత్రం జబర్దస్త్ నుండి బయటికి వచ్చాక జబర్దస్త్ మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేసినవాళ్ళకి జబర్దస్త్ కి నో ఎంట్రీనే.
అయితే ఇక్కడ ఆర్పీ మాత్రం జబర్దస్త్ మరోసారి వెళ్ళనే వెళ్ళను, నన్ను అంత అవమానించాక నేను మళ్ళీ జబర్దస్త్ లోకి అడుగుపెట్టనే పెట్టనంటూ రీసెంట్ గా తన టేక్ అ అవే హోటల్ ఓపెనింగ్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. మల్లెమాల యాజమాన్యం ఫుడ్ బాగా పెట్టదు. చాలా చీప్ గా కమెడియన్స్ ని చూస్తారు అంటూ ఆర్పీ జబర్దస్త్ యాజమాన్యంపై చేసిన కామెంట్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తున్నాయి. తాజాగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేక్ అ వే అంటూ చేపల కూరలు చేసి యూట్యూబ్ ఛానల్స్ లో తెగ ఫెమస్ అవుతున్నాడు.
ఈ ఇంటర్వ్యూలోనే ఆర్పీ ఇకపై జబర్దస్త్ కి వెళ్ళను అని చెప్పాడు. ఇలా హోటల్ బిజినెస్ లో ఉంటూనే తర్వాత మరేదన్నా చేస్తాను అంటూ చెబుతున్నాడు.