Advertisementt

బిగ్ బాస్ 6 విన్నర్ గా అవతరించిన రేవంత్

Sun 18th Dec 2022 04:25 PM
bigg boss 6 telugu,revanth  బిగ్ బాస్ 6 విన్నర్ గా అవతరించిన రేవంత్
Bigg Boss Telugu 6: Singer Revanth wins the title బిగ్ బాస్ 6 విన్నర్ గా అవతరించిన రేవంత్
Advertisement
Ads by CJ

తెలుగులో ఇప్పటివరకు జరిగిన సీజన్స్ లో అబ్బాయిలే బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయారు. సీజన్ వన్ లో శివ బాలాజీ, సీజన్ 2 లో కౌశల్, సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4 ని అభిజిత్, ఐదో సీజన్ ని విజె సన్నీ ఎగరేసుకుపోయారు. ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా బిగ్ బాస్ టైటిల్ గెలవలేదు. ఏదో ఓటిటి సీజన్ వన్ లో బిందు మాధవి విన్నర్ అయ్యింది కానీ.. ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నర్ గా ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా నిలవనట్లుగానే ఈ సీజన్ ని కూడా అబ్బాయి ఎగరేసుకుపోయాడు.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ టైటిల్ ఫెవరేటే.. బిగ్ బాస్ టైటిల్ ని ఎత్తుకెళ్లిపోయాడు. బిగ్ బాస్ సిక్స్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన సింగర్ రేవంత్ ఏ సమయంలోను విన్నర్ పొజిషన్ ని చేజార్చుకోలేదు. అగ్రెసివ్ గా ఉండడం తప్ప రేవంత్ ఏ విషయంలోనూ మిగతా కంటెస్టెంట్స్ కన్నా తక్కువగా కనిపించలేదు. స్ట్రాంగ్ అనుకున్నవారికి గట్టిపోటీ ఇస్తూనే వచ్చాడు. కాకపోతే మాట తీరు అతని ఇమేజ్ ని కాస్త డ్యామేజ్ చేసినా.. ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ రేవంత్ సొంతమైంది. నాగార్జున హోస్ట్ గా చేసిన ఈ సీజన్ కి రేవంత్ విన్నర్ గా నిలిచాడని బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి.

టాప్ 5 నుండి రోహిత్, ఆది రెడ్డి, కీర్తి ముందే ఎలిమినేట్ అవ్వగా.. టాప్ 2 లో శ్రీహన్-రేవంత్ ఉన్నారు. ఇక రేవంత్ సీజన్ 6 విన్నర్ గా అవతరించగా ఆయన ఫ్రెండ్ శ్రీహన్ రన్నర్ గా నిలిచారు. ఈ రోజు సాయంత్రం ప్రసారం కాబోయే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో రేవంత్ టైటిల్ విన్నర్ గా గెలిచినట్లుగా ప్రకటించబోతున్నారు.

అలా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన శివ బాలాజీ, కౌశల్, రాహుల్, అభిజిత్, సన్నీల పక్కన ఇప్పుడు సింగర్ రేవంత్ చేరబోతున్నాడు.

Bigg Boss Telugu 6: Singer Revanth wins the title:

Bigg Boss 6 Telugu: Revanth Lifts The Winner Trophy Of This Season

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ