Advertisementt

బిగ్ బాస్ హౌస్ లో రవితేజ-స్టేజ్ పై నాగ్

Sun 18th Dec 2022 02:05 PM
ravi teja,nagarjuna  బిగ్ బాస్ హౌస్ లో రవితేజ-స్టేజ్ పై నాగ్
Ravi Teja in Bigg Boss house బిగ్ బాస్ హౌస్ లో రవితేజ-స్టేజ్ పై నాగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ ముగింపు దశకు చేరుకుంది. నేడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో సీజన్ 6 ముగియబోతుంది. నాగార్జున హోస్ట్ గా మొదలైన సీజన్ 6 అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా.. బుల్లితెర ప్రేక్షకులు ముఖ్యంగా విలేజ్ ఆడియన్స్ ఆదరించడంతో సీజన్ 6 ఎలాగో గట్టెక్కేసింది. ఇక విన్నర్ విషయంలోనూ మొదటి నుండి సింగర్ రేవంత్ పేరు గట్టిగా విపించగా.. చివరి వరకు అదే పేరు మోగిపోయింది. నేడు ఆదివారం జరుగుతున్న గ్రాండ్ ఫినాలే లో టాప్ 5 లో ఉన్న కీర్తి, రేవంత్, శ్రీహన్, ఆది రెడ్డి, రోహిత్ లలో ఎవరు 10 లక్షల సూట్ కేస్ తో బయటికి వెళతారో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో తమ సినిమాలని ప్రమోట్ చేసుకునేందుకు 18 పేజెస్ హీరో నిఖిల్, అలాగే ధమాకా హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన లాంటి సెలబ్రిటీస్ స్టేజ్ పై సందడి చేసారు. కానీ ధమాకా హీరో రవితేజ మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి పది లక్షల సూట్ కేస్ హౌస్ మేట్స్ కి ఆఫర్ చేసాడు. రేవంత్, శ్రీహన్, కీర్తి, ఆది రెడ్డి, రోహిత్ ఇలా ఎవరు ఈ సూట్ కేస్ ని సొంతం చేసుకుంటారో అనే ఆఫర్ ఇచ్చాడు రవితేజ.

అయితే రవితేజ ఆఫర్ ని కీర్తి అందుకున్నట్టుగా తెలుస్తుంది. రవితేజ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.. నాగార్జున ఫినాలే స్టేజ్ పై ఉన్నారు. ఇదంతా ఈ రోజు సాయంత్రం ప్రసారం కాబోయే ఫినాలే ఎపిసోడ్ లో తెలుస్తుంది. రవితేజ బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 మెంబెర్స్ తో సందడి చేసిన ప్రోమో వదిలింది స్టార్ మా.

Ravi Teja in Bigg Boss house:

Bigg Boss 6 Telugu Grand Finale Promo

Tags:   RAVI TEJA, NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ