Advertisementt

బిగ్ బాస్ ఫైనల్స్ నుండి ముగ్గురు అవుట్

Sun 18th Dec 2022 11:53 AM
rohit,adi redd,keerthi,bigg boss 6  బిగ్ బాస్ ఫైనల్స్ నుండి ముగ్గురు అవుట్
Bigg Boss Telugu 6 Unexpected Eliminations In Finale Race బిగ్ బాస్ ఫైనల్స్ నుండి ముగ్గురు అవుట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి మరికొన్ని గంటల టైం మాత్రమే మిగిలి ఉంది. బిగ్ బాస్ సీజన్6 లోకి రికార్డ్ స్థాయిలో 21 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వారిలో 16 మంది ఎలిమినేట్ అవ్వగా.. టాప్ 5 లో ఐదుగురు ఉన్నారు. ఈ వారంలో చివరిగా ఇనాయని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్.. వీక్ మిడిల్ లో శుక్రవారం శ్రీ సత్యని హౌస్ నుండి పంపేశారు. ఫైనల్ గా ఉన్న ఐదుగురిలో ఎవరు ముందు బయటికి వెళతారో అనే విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూట్ మొదలైపోవడం కాదు చాలామేరకు ఫినిష్ కూడా అయ్యింది. 

ఆటలు, పాటలతో బిగ్ బాస్ స్టేజ్ పై హడావిడి పూర్తయ్యి హౌస్ లో ఉన్న ఐదుగురిలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. రేవంత్, శ్రీహన్, రోహిత్, ఆది రెడ్డి, కీర్తి లు టాప్ లో ఉండగా.. వారిలో రోహిత్, కీర్తి, ఆది రెడ్డి లు ముందుగానే ఎలిమినేట్ అయ్యినట్లుగా తెలుస్తుంది. అంటే టాప్ 2 లో నాగార్జున పక్కన రేవంత్-శ్రీహన్ నిలబడబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారో అనేది పెద్దగా ఆలోచించక్కర్లేదు కూడా. ఎందుకంటే హౌస్ లోకి ఎంటర్ అయినప్పటినుండి విన్నర్ గాలి రేవంత్ వైపే వీస్తుంది.

ఇప్పటికే రేవంత్ విన్నర్ అంటూ అతని ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ కంగ్రాట్స్ చెబుతూ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. రేవంత్ విన్నారా? లేదంటే శ్రీహన్ విన్నారా? అనేది మరికాసేపట్లో తేలిపోతుంది.

Bigg Boss Telugu 6 Unexpected Eliminations In Finale Race:

Rohit, Adi Reddy and Keerthi Eliminated in Bigg Boss Finale

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ