Advertisementt

NBK108 టీమ్ మెంబెర్స్ కి ప్రమాదం

Sun 18th Dec 2022 10:57 AM
anil ravipudi,nbk108  NBK108 టీమ్ మెంబెర్స్ కి ప్రమాదం
NBK108 team vehicle accident NBK108 టీమ్ మెంబెర్స్ కి ప్రమాదం
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న NBK108 మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గత వారమే మొదలయ్యింది. మొదలైన వెంటనే యాక్షన్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ కి వెళ్లిపోయారు అనిల్ అండ్ బాలయ్య లు. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రశాంతంగా షూటింగ్ జ‌రుగుతున్న ఈ సినిమా యూనిట్‌కు చిన్న ప్రమాదం జరిగింది. NBK108 షూటింగ్ లో పాల్గొనేందుకు జూనియర్ ఆర్టిస్ట్ లు వెళుతున్న వాహనం ప్రమాదానికి గురైంది.

తెల్లవారు ఝామున జూనియ‌ర్ ఆర్టిస్టులు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం బాచుప‌ల్లి ద‌గ్గ‌ర ప్ర‌గ‌తి న‌గ‌ర్ చెరువు స‌మీపంలో బోల్తా ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్ట్ లు నలుగురికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన స్థ‌లానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని ద‌గ్గ‌ర‌లోని హాస్పిట‌ల్‌కు చేర్చిన‌ట్లు తెలుస్తుంది. ప్రాణ భయం లేదని, చిన్న చిన్న దెబ్బలతో వాహనంలోని వారు బయటపడ్డారని చెబుతున్నారు.

NBK108 team vehicle accident:

Anil Ravipudi - Accident to the NBK108 film team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ