మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక నమ్రత శిరోద్కర్ నటనకు గుడ్ బై చెప్పేసి ఘట్టమనేని ఫ్యామిలీని, మహేష్ బాబు వ్యాపారాలతో పాటుగా, ఇద్దరి పిల్లల సంరక్షణలో మునిగిపోయింది. ఘట్టమనేని ఫ్యామిలీ లో అకాలంగా సంభవించిన మరణాలతో మహేష్ కుంగిపోకుండా నమ్రత చాలా కృషి చేసింది. ఇదంతా చూసిన నమ్రతని పొగడని వారే లేరు. అయితే తాజాగా మహేష్ బాబు తనకి పెళ్ళికి ముందే పెట్టిన కండిషన్ గురించి అలాగే తన పిల్లల గురించిన సీక్రెట్స్ ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది నమ్రత శిరోద్కర్.
తాజాగా నమ్రత ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మొదటిసారి తన పర్సనల్ వివరాలను, విషయాలను, సీక్రెట్స్ ని పంచుకుంది. మహేష్ తో పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పడానికి వెనక కారణం ఉందా అని అడగగానే.. దానికి నమ్రత మహేష్ తో పెళ్లి జరగక ముందే మహేష్ తనకో కండిషన్ పెట్టారని, కానీ మహేష్ తో పెళ్లి ఆ హ్యాపీ మూమెంట్ ముఖ్యమని తాను ఆ కండిషన్ ని అంగీకరించాను అంటూ ఆసక్తికరమైన జవాబు చెప్పింది.
అంతేకాకుండా సితార ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదని, సితార అన్ ప్లాన్డ్ బేబీ అంటూ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. కానీ సితార పుట్టకపోతే మా లైఫ్ అసంపూర్ణంగా మిగిలిపోయేదేమో. ఇక గౌతమ్ ఎనిమిదోనెలలోనే పుట్టేసాడు. అసలు గౌతమ్ బ్రతుకుతాడని అనుకోలేదు. ఆ సమయంలో మేమెంతో కఠిన పరిస్థితులని చూసాం అంటూ నమ్రత ఎమోషనల్ అయ్యింది.