బాలీవుడ్ మీద సౌత్ సినిమాల హావాని అక్కడి ప్రముఖులు తట్టుకోలేకపోతున్నారు. చిన్న చిన్న సౌత్ మూవీస్ అన్ ఎక్స్పెక్టెడ్ గా బాలీవుడ్ మీద దండయాత్రకు దిగి అక్కడి సినిమాలను రఫ్ ఆడిస్తున్నాయి. హిందీలో తెరకెక్కిన సినిమాలేవీ నార్త్ ఆడియన్స్ కి అస్సలు ఎక్కడం లేదు. దానితో సౌత్ సినిమాల హిట్స్ మీద పడి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఏడుస్తున్నారు. ఇప్పుడొక నటి బాలీవుడ్ కి ఈ గతి ఎందుకు పట్టిందో చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు నీనా గుప్త. నీనాగుప్తా నటించిన వధ్ సినిమా ప్రమోషన్స్ లో ఆమె ఈ విషయాలను కెలికింది.
బాలీవుడ్ కి ఈ గడ్డు పరిస్థితి రావడానికి గల కారణాలను ఏకరువు పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు ఆడియన్స్ మెప్పు పొందకపోవడానికి ప్రధాన కారణం.. నేటి తరం హీరోలు ఆడియెన్స్‌ను మెప్పించలేకపోతున్నారు. యంగ్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకోలేక విఫలమవుతున్నాయి. మరోపక్క కోవిడ్ సిట్యువేషన్ కూడా ప్రేక్షకుల వద్ద డబ్బు లేకుండా చేసింది. ఎంటర్టైన్మెంట్ కోసం వెచ్చించే డబ్బు లేకపోయింది. అందుకే సినిమాలు చూడడం కూడా తగ్గించారు.
ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఉద్యోగాలు పోయాయి. బిజినెస్ ల్లో లాస్ వలనే సినిమాలు చూడడం మానేశారు. అందుకే హిందీ సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. మంచి సినిమాలు అనుకుంటే ఆడుతున్నాయి.. అంటూ నీనా గుప్త బాలీవుడ్ కి ఈ పరిస్థితి రావడానికి కారణాలను చెప్పుకొచ్చింది.