Advertisementt

సైలెంట్ అయిన సమంత

Sat 17th Dec 2022 08:42 PM
samantha,social media  సైలెంట్ అయిన సమంత
Samantha in silent mode సైలెంట్ అయిన సమంత
Advertisement
Ads by CJ

సమంత యశోద రిలీజ్ కి ముందు తాను మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా చెప్పకముందు ఆమె ఏదో అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతూ నలుగురిలోకి రాలేకపోతుంది. ఆ ట్రీట్మెంట్ కోసం ఆమె విదేశాలకు వెళ్ళింది అనే న్యూస్ లు ప్రచారంలోకి రావడంతో సమంత అలెర్ట్ అయ్యి అసలు విషయాన్ని బయటపెట్టింది. అందులో యశోద ప్రమోషన్స్ లో కనిపించకపోతే సమంతపై అనుమానాలు మరింతగా పెరిగిపోతాయి. అందుకే సమంత అప్పట్లో అంతలా ఓపెన్ అయ్యింది.

మొన్నీమధ్యన సమంత ఆరోగ్యం మరింతగా క్షీణించగా ఆమెని సౌత్ కొరియాకి తరలించారు, కాదు ఆసుపత్రిలో జాయిన్ చేశారనే న్యూస్ లు కూడా వినిపించాయి. కానీ సమంత పేరెంట్స్, ఆమె మేనేజర్ ఈ వార్తలని కొట్టిపారేశారు. సమంత ఆరోగ్యంగా ఉంది అంటూ మేనేజర్ హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. సమంత క్రమంగా కోలుకుంటుంది అని చెప్పారు. ఇక హిట్ 2 హిట్ అవడంతో అడివి శేష్ కి కంగ్రాట్స్ కూడా చెప్పిన సమంత ని హిట్ సీరీస్ లో జాయిన్ చేస్తే బావుంటుంది అని నెటిజెన్ ఇచ్చిన ఐడియా కి అడివి శేష్ మెచ్చి సమంతని రిక్వెస్ట్ కూడా చేసాడు. ఇది జరిగి అప్పుడే పదిరోజులు అవుతుంది. తర్వాత ఆమె సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది.

అయితే సమంత హెల్త్ స్టేటస్ విషయంలో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. ఇప్పటివరకు సమంత కోలుకోలేదా.. కోలుకుంటే హెల్త్ అప్ డేట్ ఇవ్వమంటున్నారు. అటు సమంత కోలుకున్నాకే ఆమె నటించే ఖుషి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది, అలాగే పాన్ ఇండియా ప్రాజెక్ట్ శాకుంతలం రిలీజ్ కి రెడీ అవ్వాలి. కానీ సమంత హెల్త్ విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే ఆమె మౌనంగా ఉంటుంది.

Samantha in silent mode:

Samantha is silent on social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ