Advertisement

ఎట్టకేలకి అఖిల్ ఏజెంట్ అప్ డేట్

Sat 17th Dec 2022 05:19 PM
akhil,agent update  ఎట్టకేలకి అఖిల్ ఏజెంట్ అప్ డేట్
Finally Akhil Agent update ఎట్టకేలకి అఖిల్ ఏజెంట్ అప్ డేట్
Advertisement

అఖిల్ అక్కినేని ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో కనిపిస్తున్నాడు. సంక్రాంతికి ఏజెంట్ రిలీజ్ అని చెప్పి ఇప్పుడు ఇలా కామ్ గా ఉండడం అక్కినేని ఫాన్స్ కి నచ్చడం లేదు. భారీ బడ్జెట్ తో ఏజెంట్ ని  పాన్ ఇండియా మూవీ గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్న AK ఎంటెర్టైమెంట్ వాళ్ళు కూడా ఏజెంట్ మూవీ అప్ డేట్ ఇవ్వకుండా నాన్చుతున్నారు. రీసెంట్ గానే అఖిల్ జిమ్ లో తన పెట్ తో ఆడుకుంటూ కనిపించాడు. అటు సురేందర్ రెడ్డి కూడా ఏజెంట్ విషయంలో ఏం జరుగుతుంది క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేసారు. 

తాజాగా ఏజెంట్ నుండి అప్ డేట్ రాబోతుంది. అది షూటింగ్ విషయంలో మాత్రమే. కొత్త షెడ్యూల్ ఎక్కడ ఎప్పుడు అనేది తెలుస్తుంది. జనవరి మొదటి వారం నుండి మస్కట్‌లో భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరించనున్నారు. అంతేకాకుండా ఫిబ్రవరిలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఏజెంట్ కి సంబందించిన 2 పాటల చిత్రీకరణ జరగనున్నాయి. అందులో ఒకటి డ్యూయెట్ కాగా.. మరొకటి స్టార్ హీరోయిన్ చేసే ఐటెం సాంగ్ గా తెలుస్తుంది.  

అఖిల్ కి జోడిగా సాక్షి వైదే నటిస్తుండగా.. ఏజెంట్ సంక్రాంతి బారి నుండి అఫీషియల్ గా తప్పుకుంది. అయితే ఏప్రిల్ 7 న అఖిల్ ఏజెంట్ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Finally Akhil Agent update:

Akhil Agent shooting update

Tags:   AKHIL, AGENT UPDATE
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement