నందమూరి నటసింహ బాలకృష్ణ తో సినిమా మొదలు పెట్టకముందే అనిల్ రావిపూడి NBK108 పై అంచనాలు పెంచేసాడు. రీసెంట్ గా సినిమాని యాక్షన్ సీక్వెన్స్ తో మొదలు పెట్టారు. ఈమధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలైన NBK108 లో బాలయ్య నడివయసులో ఉన్నపాత్రలో సూపర్ లుక్ లో అభిమానులు మెచ్చేలా ఉండబోతున్నారని అనిల్ చెప్పారు. సింహం ఈసారి సింగిల్ గానే రాబోతుంది.. బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపించరని చెప్పేసారు.
యంగ్ హీరోయిన్స్ శ్రీలీల బాలయ్య కి కూతురిగా కనిపించబోతున్న ఈ సినిమా కోసం త్రిషని బాలయ్యకి హీరోయిన్ గా అనుకుని అనిల్ రావిపూడి ఆమెని సంప్రదించే పనిలో ఉన్నారట. మరోపక్క కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ NBK108 సెట్స్ లోకి అడుగుపెడుతున్నట్టుగా అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. శరత్ కుమార్ విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో పవర్ ఫుల్ పాత్రలతో ఈమధ్యన బాగా హైలెట్ అవుతున్నారు. ఇప్పుడు NBK108 లో శరత్ కుమార్ ఎలాంటి రోల్ చేయబోతున్నారో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మొదలైంది.
ప్రస్తుతం హైదరాబాద్ లోనే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణలో టీమ్ బిజీగా ఉండగా.. బాలయ్య త్వరలోనే వీరసింహ రెడ్డి ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఎందుకంటే సంక్రాంతికే వీర సింహ రెడ్డి రిలీజ్ కి రెడీ అవుతుంది కాబట్టి.