మంచు మనోజ్ కొద్దిరోజులుగా రెండో పెళ్లి విషయంలో తెగ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. సినిమాల విషయంలో సైలెంట్ మోడ్ లో ఉన్న మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడు. వినాయకచవితి అప్పుడే మనోజ్ రెండో పెళ్లి విషయం మీడియాకి తెలిసిపోయింది. భార్య ప్రణతికి విడాకులిచ్చిన తర్వాత మనోజ్ కొద్ది రోజులు ఒంటరిగానే ఉండి.. తర్వాత మౌనిక ప్రేమలో పడినట్లుగా తెలుస్తుంది. అటు మౌనిక కూడా భర్త కి విడాకులిచ్చి ఒంటరిగా ఉంటుంది. ఇక భర్త విడిపోయాక మౌనిక హైదరాబాద్ లో ఉంటున్న సమయంలోనే ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మనోజ్ తో సాన్నిహిత్యం పెంచుకున్నట్లుగా తెలుస్తుంది.
మొన్న దసరాకే మనోజ్-మౌనిక రెడ్డిల వివాహం జరగొచ్చనే ఊహాగానాలు నడిచాయి. మోహన్ బాబుకి ఇష్టం లేకపోయినా.. మనోజ్ ఈ వివాహం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాడని, చేసేది లేక మోహన్ బాబు కూడా మనోజ్ పెళ్లిని ఒప్పుకున్నారనే టాక్ నడుస్తుంది. రీసెంట్ గా భూమా అఖిల ప్రియా కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని, అక్కడ నంద్యాలలోని భుమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సమాధుల వద్ద నివాళు అర్పించాడు మనోజ్. దానితో మరోసారి మనోజ్ పెళ్లి మీడియాలో న్యూస్ గా మరింది.
అయితే మంచు మనోజ్-మౌనిక రెడ్డిల వివాహ తేదీ నిశ్చయమైంది అని, వచ్చే ఏడాది అంటే 2023 ఫిబ్రవరి 2 న మనోజ్ మౌనిక రెడ్డి మెడలో తాళి కట్టబోతున్నట్లుగా ఓ తేదీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే వీరి వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.