Advertisementt

బిగ్ బాస్: నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో రేవంత్

Sat 17th Dec 2022 11:11 AM
revanth,big boss 6,big boss telugu 6 winner  బిగ్ బాస్: నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో రేవంత్
Revanth hashtag trends on Twitter బిగ్ బాస్: నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో రేవంత్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి టాస్క్ పెరఫార్మెన్స్ లో తోపులా మారిన సింగర్ రేవంత్ నోటి దురుసు, నాగార్జున తిట్ల తో కాస్త డీ ఫేమ్ అయినా.. చివరి వారం వరకు గేమ్ లో గ్రిప్ వదలకుండా మెరుగైన ఆట తీరుతో మిగతా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇస్తూ విన్నర్ రేస్ లో నిలిచాడు. టైటిల్ ఫెవరెట్ గా రేవంత్ పేరు మొదటి నుండి వినిపిస్తున్నా.. కొంతమంది కంటెస్టెంట్స్ అతని ఆట తీరును ఒప్పుకోలేక, అతనితో పోటీ పడలేక సతమతమయ్యారు. ముఖ్యంగా గీతూ, ఫైమా నిన్నగాక మొన్న ఎలిమినేట్ అయిన ఇనాయ లాంటి వారు రేవంత్ ఆటని పక్కనబెట్టి అతని వ్యక్తిత్వాన్ని హైలెట్ చేస్తున్నారు.

ఇక చివరి వారంలో ఫైనల్ గా విజేతగా రేవంత్ నికలుస్తాడని ఆయన అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. మరోపక్క ఈ వారం విన్నర్ ఓటింగ్ లో చాలా స్ట్రాంగ్ అయిన రేవంత్ కి ఎక్కువ ఓట్స్ పడుతున్నట్లుగా ఓ న్యూస్ లీకవడంతో బిగ్ బాస్ విన్నర్ గా ఫిక్స్ అయిన ఆయన ఫాన్స్ రేవంత్ కి కంగ్రాట్స్ చెబుతూ.. ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. సింగర్ రేవంత్ కి ఓటింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ కట్టబెట్టగా రన్నర్ విషయంలో ఆది రెడ్డి లేదా శ్రీహన్ అన్న విషయం కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. శ్రీహన్ రన్నర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఇక రేవంత్ కి కంగ్రాట్స్ చెబుతూ పెడుతున్న పోస్ట్ లతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. వార్ వన్ సైడ్.. మా రేవంత్ అన్నే విన్నర్ అంటూ ఆయన ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Revanth hashtag trends on Twitter:

Bigg Boss 6: Singer Revanth trends on Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ