యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్, యాడ్ షూటింగ్ అన్ని పక్కనబెట్టి తన ఫ్యామిలీతో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ రీసెంట్ గా యుఎస్ ట్రిప్ వేశారు. ఓ నెల రోజుల పాటు ఎన్టీఆర్ యుఎస్ లోనే ఉండబోతున్నారట, అక్కడే న్యూస్ ఇయర్ సెలెబ్రేషన్స్ కి ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది. యుఎస్ లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్న ఎన్టీఆర్ నుండి ఓ అద్భుతమైన పిక్ బయటికి వచ్చింది. భార్య లక్ష్మి ప్రణతిని ఎన్టీఆర్ హాగ్ చేసుకుని తన్మయత్వంలో ఉన్న పిక్ అది.
అలా ఎన్టీఆర్ ప్రణతి తో కలిసి ఉన్న పిక్ బయటికి రాగానే ఎన్టీఆర్ ఫాన్స్ అలర్ట్ అయ్యారు. ఇలాంటి రేర్ పిక్స్ ని ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తన ఫ్యామిలీని ఎక్కవగా పబ్లిక్ లో ఫోకస్ చెయ్యరు. చాలా లో ప్రొఫైల్ మెయింటింగ్ చేస్తారు, ఏదో ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే తప్ప ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ అరుదుగా మీడియాకి దొరుకుతారు. అందుకే ఎన్టీఆర్ తన భార్య తో ఉన్న ఆ పిక్ ఇలా క్షణాల్లో వైరల్ అయ్యింది.
ఇక ఎన్టీఆర్ అమెరికా ట్రిప్ ముగించుకుని సంక్రాంతి ఫెస్టివల్ కూడా ఫినిష్ అయ్యాకే కొరటాలతో కలిసి NTR30 సెట్స్ మీదకి వెళతారని తెలుస్తుంది.