Advertisementt

ఈ అందానికి మళ్లీ లిఫ్ట్ ఇచ్చెదెవరు?

Sun 25th Dec 2022 10:31 AM
ketika sharma,romantic,lakshya,ranga ranga vaibhavamgaa,pawan kalyan,shruti haasan  ఈ అందానికి మళ్లీ లిఫ్ట్ ఇచ్చెదెవరు?
No Offers to Beautiful Heroine Ketika Sharma ఈ అందానికి మళ్లీ లిఫ్ట్ ఇచ్చెదెవరు?
Advertisement
Ads by CJ

కేతిక శర్మ.. ఈ భామను హాట్ బాంబ్ అనాలో.. బ్యూటీ బ్లాస్ట్ అనాలో.. ఇంకా ఏ ట్యాగ్ అయినా సరే.. అన్నింటికి న్యాయం చేయగల ఫిగర్ ఆమెది. అయితే అదృష్టం అనేది ఆమెకు కరువైపోయింది. పూరీ జగన్నాధ్ నిర్మించిన ‘రొమాంటిక్’ అనే చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ భామ.. రావడం రావడమే అందాలను విరజిమ్మేసింది. ఎంతలా అంటే.. కుర్ర హీరోలంతా తనవైపు చూసేలా. ఆ వెంటనే నాగశౌర్య తన లక్ష్యా(క్ష్య)న్ని ఆమెపై పెట్టాడు. కానీ.. అది గురి తప్పంది. ఆ తర్వాత నా వంతు అన్నట్లుగా మెగా హీరో ‘ఉప్పెన’లా లైన్‌లోకి వచ్చాడు. 

 

అయినా ఏం లాభం.. ఆమెతో అంతా ‘రంగ రంగ వైభవంగా’ సాగిపోతుందని అనుకుంటే.. పాపం వైష్ణవ్‌కి కూడా ఆ సినిమా దెబ్బకొట్టింది. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు అందమే కానీ.. అదృష్టం లేదనేలా ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. శృతిహాసన్ వంటి వారికే మొదట్లో ఐరన్ లెగ్ ట్యాగ్ వేసిన ఇండస్ట్రీ ఇది. దీంతో దర్శకనిర్మాతలను ఆమె అందం టెంఫ్ట్ చేస్తున్నా.. ఆమె హిస్టరీ భయపెట్టేస్తోంది. అందుకేనేమో.. సోషల్ మీడియాలో అమ్మడు ఆరబోతకి దిగింది. 

 

అయినా.. ఆమెకు లిఫ్ట్ ఇచ్చే వారు మాత్రం ఇప్పుడు కరువయ్యారు. అర్జెంట్‌గా ఆమె ఖాతాలో ఓ హిట్ పడితేనే తప్ప.. ఆమె అందానికి, ఆరబోతకి ఓ అర్థం ఉండే ఛాన్స్ లేదు.. లేదంటే అవన్నీ సోషల్ మీడియాకే తప్ప ఉపయోగం లేదు. ‘గబ్బర్ సింగ్’తో అప్పటి వరకు ఉన్న శృతిహాసన్ ఐరన్ లెగ్‌ని మార్చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి లిఫ్ట్ ఇచ్చే హీరో.. అర్జెంట్‌గా కేతికకు కావాలి. ఆమె అందాన్ని సోషల్ మీడియాకి సొంతం కానివ్వకుండా చేసే ఆ హీరో ఎవరో..? వెయిట్ అండ్ సీ..  

No Offers to Beautiful Heroine Ketika Sharma:

Ketika Sharma Unluck Continues..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ