ప్రస్తుతం జబర్దస్త్ కాస్త డల్ గానే సాగుతుంది. హైపర్ ఆది రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపించడం లేదు, వారం వారం జబర్దస్త్ టీఆర్పీ తగ్గిపోతుంది. అనసూయ తప్పుకోవడం అదే సమయంలో సుడిగాలి సుధీర్ బయటికి వెళ్లడం.. స్కిట్స్ లో కొత్త దానం లోపించడం వంటి విషయాలు, జబర్దస్త్ పై బయట వినిపిస్తున్న కామెంట్స్ అన్ని జబర్దస్త్ పై ఊపు తగ్గించాయి. కామెడీ ప్రియులు కూడా జబర్దస్త్ ని యూట్యూబ్ లో వీక్షించడానికి చూస్తున్నారు కానీ.. ఈటివిలో గురు, శుక్ర వారాల్లో రాత్రి 9.30 వరకు ఎవరూ వెయిట్ చెయ్యడం లేదు.
ఇక సుధీర్, ఆది లాంటి వాళ్ళు వెళ్లిపోవడంతో జబర్దస్త్ టైమింగ్స్ కూడా కుదించేసి.. స్కిట్స్ తగ్గించేశారు. గతంలో ఐదు స్కిట్స్ ఉంటే.. ఇప్పడు నాలుగు స్కిట్స్ కి తగ్గించారు. కొంతమంది టీమ్ లీడర్స్ వేరే వాళ్ళ టీమ్ లో కామెడీ చేస్తున్నారు. అలాగే రోహిణి లాంటి వాళ్ళు టీమ్ ని ఫామ్ చేసారు. ఇప్పుడు తాజాగా ఓ కొత్త కామెడీ బ్యాచ్ టీమ్ ని ఫామ్ చేసుకుని స్కిట్ చెయ్యబోతున్నారు. వారే ఈటివి పటాస్ లో ఫెమస్ అయ్యి.. తర్వాత జీ ఛానల్ లో అదిరింది, స్టార్ మా లో కామెడీ స్టార్స్ లో చేసిన సద్దాం వాళ్ళు.
జబర్దస్త్ లోకి టీమ్ లీడర్ గా సద్దాం.. యాదమ్మ రాజు, షైనింగ్ శాంతికుమార్‌లతో వచ్చే వారం ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎప్పటినుండో సద్దాం, యాదమ్మ రాజులు జబర్దస్త్ లోకి వస్తారని ప్రచారం జరిగినా.. అది ఇప్పటికి కుదిరినట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తుంది. జబర్దస్త్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడంతోటే.. సద్దాం తనదైన పంచులతో నవ్వించాడు. స్కిట్‌లో తాను చానెల్స్ మారడంపై తన మీద తానే పంచులు వేసుకున్నాడు. జబర్దస్త్ తన హోమ్ గ్రౌండ్ కాబట్టి.. అందుకే తిరిగి తిరిగి ఇక్కడకే వచ్చానని చెప్పడంతో అతని టీమ్ ఇకపై నవ్వించబోతున్నట్లుగా అర్ధమవుతుంది.