సౌత్ నుండి బిషానా ఎత్తేసి బాలీవుడ్ లో జెండా పాతి అక్కడ తనకి సరిపోయే కథలని ఎంచుకుంటూ బిజీ అయిన తాప్సి పన్నుకి బాలీవుడ్ స్టార్ నటి కంగనాకు అస్సలు పడదు. తాప్సి ని కంగానా చిన్న చూపు చూస్తూ మాట్లాడుతుంది. కంగనాకి తాప్సి కరెక్ట్ కౌంటర్ వేస్తుంది. తాజాగా తాప్సి దోబారా ప్రమోషన్స్ లో మీడియా మీద ఫైర్ అయ్యింది. తాప్సి మీ సినిమాని నెటిజెన్స్ బాయ్ కాట్ చేస్తామంటున్నారు అని అడగగానే.. దానికి తాప్సి మీరు చెప్పండి ఏ సినిమా బాయ్ కాట్ ని ఎదుర్కోవడం లేదో.. ప్రశ్న అడిగేముందు అన్ని ఆలోచించండి అంటూ వారిపై ఎగిరింది. తాప్సి మీడియా మీద ఫైర్ అయిన వీడియోస్ ని నెటిజెన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసారు.
దానితో బాగా హార్ట్ అయిన తాప్సి పన్ను దానికి వివరణ ఇస్తూ ఈ మధ్యన నేను జర్నలిస్ట్ లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చాలా వీడియోస్ ని వైరల్ చేసారు. నాకు కెమెరా ముందు ఒకలా, బయట ఓ లాగా నటించడం చేతకాదు. ఉన్నది ఉన్నట్టు, అనుకున్నది అనుకున్నట్టుగా మట్లాడేస్తాను. ఈ వీడియోస్ చూసి నెటిజెన్స్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారు. నన్ను తిట్టారు. అవి చూసి నేను చాలా బాధపడ్డాను. అందుకే సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, నాపై వచ్చే నెగెటివ్ వార్తలని చూడకూడదని ఫిక్స్ అయ్యాను.
అందరిలా నాకు నటించడం రాదు, ఎవరో పొగుడుతారని ఆరాటపడను, కొంతమంది కెమెరా ముందు మాత్రమే కాదు, బయట కూడా నటిస్తారు. నాకు అది చేతకాదు. అనుకున్నది అనుకున్నట్లుగా మనస్ఫూర్తిగా మాట్లాడతాను. అందరికి నేను నచ్చెయ్యాలని లేదు, కానీ నా నటన నచ్చితే చాలు అంటూ తాప్సి చెప్పుకొచ్చింది.