టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా తీస్తే క్రేజీగా ఉంటుంది అనుకుంటే.. టాలీవుడ్ నిర్మాతల మండలి నుండి తీవ్ర వ్యతిరేఖత మొదలయ్యింది. అది కూడా సంక్రాంతికి దిల్ రాజు-విజయ్ వారసుడు విడుదలపై తీవ్ర వివాదం చెలరేగగా.. ఈ రోజు శుక్రవారం దిల్ రాజు మీడియా మీట్ నిర్వహించి అసలు సంక్రాంతికి విడుదలవుతున్న వాల్తేర్ వీరయ్య-వీరసింహ రెడ్డి నిర్మాతలతో నాకు ఎలాంటి ప్రోబ్లెంస్ లేవు. వేరే వాళ్ళ వల్లే అసలు ప్రాబ్లెమ్. కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నాకు నైజాం లో 37 థియేటర్స్ ఉన్నాయి. మిగతా థియేటర్స్ లో సినిమా దమ్ముని బట్టి రిలీజ్ అవుతాయంటూ సంక్రాంతి రిలీజ్ సినిమాల కాంట్రవర్సీకి సింఫుల్ గా ముగింపు పలికారు.
ఇక వారసుడు కథతో మహేష్ బాబు తో వంశీ పైడిపల్లి సినిమా చెయ్యాలనుకున్నాడు. కానీ మహేష్ బాబు వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో అది కుదరలేదు. ఇంకా టాలీవుడ్ కొందరి హీరోలని ఈ కథతో అప్రోచ్ అయ్యాము. రామ్ చరణ్ కి ఈ కథ తెలుసు. కానీ అప్పటికే శంకర్ దర్శకత్వం,లో చరణ్ మూవీ రెడీ అవుతుంది. అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ఎవరితో సినిమా చేద్దామనుకున్నా వారు ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అవవడం వలనే.. చివరికి కోలీవుడ్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్నాం.
విజయ్ కూడా వారసుడు కథని విని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అలాగే విజయ్ డేట్స్ ఇవ్వడంతో వంశి పైడిపల్లి, నేను విజయ్ తో వారసుడు సెట్స్ మీదకి వెళ్లమంటూ దిల్ రాజు ఆ మీడియా మీట్ లో వివరించాడు.