జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుందా అని శ్రీదేవి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ బాలీవుడ్ లో నిలదొక్కుకున్నాకే సౌత్ కి ఎంట్రీ ఆలోచనలో ఉన్న జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ ఎంట్రీ కోసమై ఎదురు చూస్తుంది. బాలీవుడ్ లో పాప పరిస్థితి బావుంటే ఆమె ఇక్కడికి వచ్చేది కాదు, కానీ అక్కడ అమ్మడు పరిస్థితి ఏం బాలేదు. సో సౌత్ లో అయినా హిట్ కొట్టాలని జాన్వీ చూస్తోంది. ఇప్పుడు జాన్వీ కపూర్ ఆశ, శ్రీదేవి అభిమానుల కోరిక తీరబోతున్నట్లుగా తెలుస్తుంది.
అంటే కొరటాల శివ-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కబోయే మూవీలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చెయ్యడమే కాదు, జాన్వీ కపూర్ కూడా NTR30 కి సైన్ చేయబోతుంది అంటూ బజ్ వినిపిస్తుంది. ఎలాగూ NTR30 పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవ్వడంతో జాన్వీ కపూర్ అన్ని సౌత్ భాషలకి ఒకేసారి ఇంట్రడ్యూస్ అవుతుంది, బాలీవుడ్ లో కూడా పరిస్థితి బాలేదు అని బోని కపూర్ ఇచ్చిన సలహాతోనే జాన్వీ కపూర్ NTR30 లో నటించడానికి ఒప్పుకుందట,
ఎలాగూ తన డ్రీం కూడా ఈ ప్రాజెక్ట్ తో తీరబోతుంది అని జాన్వీ కపూర్ NTR30 కి సైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ తో నటించాలని ఉంది అంటూ జాన్వీ ఎప్పుడో చెప్పింది. సో ఈ సినిమాలో గనక నటిస్తే జాన్వీ కపూర్ కోరిక తీరినట్లే కదా.