Advertisementt

వీరసింహారెడ్డి vs వాల్తేర్ వీరయ్య థియేటర్ స్టాండీస్

Fri 16th Dec 2022 04:24 PM
veera simha reddy,waltair veerayya  వీరసింహారెడ్డి vs వాల్తేర్ వీరయ్య థియేటర్ స్టాండీస్
Veera Simha Reddy vs Waltair Veerayya వీరసింహారెడ్డి vs వాల్తేర్ వీరయ్య థియేటర్ స్టాండీస్
Advertisement
Ads by CJ

నటసింహ నందమూరి బాలకృష్ణ ను మునుపెన్నడూ చూడని మాస్ మరియు యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో గోపీచంద్ మలినేని వీర సింహారెడ్డి లో చూపించబోతున్నారు. ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమం లో చిత్ర  బృందం అవుట్ డోర్ ప్రమోషన్ లను ప్రారంభించింది. థియేటర్ స్టాండీలు సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని థియేటర్లకు పంపుతున్నారు.

బ్లాక్ షర్ట్ మరియు లేత గోధుమరంగు రంగు లుంగీతో గంభీరంగా కారు పక్కన నడుస్తున్న బాలకృష్ణ స్టిల్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఐకానిక్ స్టిల్ ఇప్పటికే మాస్ లో బాగా ప్రాచుర్యం పొందింది మరియు థియేటర్ స్టాండీల పై ఇంకా గొప్పగా కనిపిస్తుంది. వీరసింహారెడ్డి చిత్రం చివరి పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుక గా విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరో చిత్రం వాల్తేర్ వీరయ్య కూడా మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రంగా సంక్రాంతి 2023 నే విడుదల కాబోతుంది. దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. రీసెంట్ గా విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ తో ట్రెండింగ్ లో ఉంది. బాస్ పార్టీ పాట 25 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను సంపాదించింది మరియు సోషల్ మీడియా ట్రెండింగ్ రీల్స్ లో నిలిచింది. స్టాండీస్ పై  ఉండే పోస్టర్ ను విడుదల చేశారు. పోలీసు స్టేషన్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశం నుండి మెగాస్టార్ చిరంజీవి స్టిల్ ని విడుదల చేయడం జరిగింది. ఇందులో వీరయ్య గా మెగాస్టార్ చిరంజీవి ఒక చేతికి సంకెళ్లతో బ్యాగ్రౌండ్ లో తుపాకీలతో గంభీరంగా కూర్చుని కనిపిస్తున్నారు.

స్టైలిష్ ఇంకా భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేము సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ యొక్క స్వాగ్ వాగ్దానం చేస్తుంది. మసాలా జోడించి, థియేటర్ల లో ఈ ఎపిసోడ్ కి పూనకాలూ గ్యారెంటీ అనే విధం గా డైరెక్టర్ బాబీ ట్విట్టర్ లో ఈ స్టిల్ ని విడుదల చేశారు. ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్ ఇంకెంతమాత్రం వెయిట్ చేయలేము అంటూ స్పందించారు. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది మరియు చివరి పాటను ప్రస్తుతం చిరంజీవి మరియు శృతి హాసన్ లపై యూరప్ లో చిత్రీకరిస్తున్నారు.

Veera Simha Reddy vs Waltair Veerayya:

Theater Standees from Veera Simha Reddy vs Waltair Veerayya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ