ప్రస్తుతం తెలంగాణాలో ఈడీ దూకుడు కనిపిస్తుంది. ఈమధ్యనే లిక్కర్ స్క్యామ్ లో ఎమ్యెల్సీ కవితని ఆమె ఇంట్లోనే విచారించిన అధికారులు, ఇప్పుడు బిజెపి ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసు లు ఇవ్వడం హాట్ టాపిక్ కాగా.. అదే డ్రగ్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ కి కూడా ఈడీ నోటీసు లు ఇవ్వడమే ఎవ్వరికి అర్ధం కావడం లేదు. గతంలోనే రకుల్ ప్రీత్ డ్రగ్స్ కేసులోనూ, మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యింది. కానీ ఇపుడు పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటుగా రకుల్ ప్రీత్ కి కలిపి ఈడీ విచారణకు పిలవడం మాత్రం నిజంగా ఎవరికి అంతుపట్టని విషయంగా మారింది.
గతంలో సినీ నటులు చాలామందితో పాటుగా రకుల్ ప్రీత్ ఈడీ విచారణకు హాజరైంది. ఆమెకి కేటాయించిన తేదీలో రకుల్ ఈడి అధికారుల ముందు హాజరైంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈడీ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ కి ఎందుకు నోటీసులు ఇచ్చిందో కానీ.. రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసుకి రకుల్ కేసుకి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలోనే అందరూ ఆలోచిస్తున్నారు. పొలిటికల్ గా రకుల్ ఇరుక్కుందేమో అంటున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు చెయ్యకుండా కేవలం హిందీ, తమిళంలో మూవీస్ చేస్తున్న రకుల్ ఇప్పుడు ఈడీ విచారణకు హాజరవడం హాట్ టాపిక్ అనే చెప్పాలి.
ఈడీ నోటీసులు అందుకున్న రకుల్ ఎప్పుడు, ఏ తేదీలో ఈడీ విచారణకు హాజరవుతుందో తెలియాల్సి ఉంది.