ఒకప్పుడు పెళ్ళయితే అవకాశాలు రావేమో అని హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనకడుగు వేసేవారు. కానీ ఈ తరం హీరోయిన్స్ పెళ్ళయ్యి తల్లయినా తగ్గడం లేదు. పెళ్లయ్యాక హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేసే వారు, తల్లయ్యాక జిమ్ లు, యోగ సెషన్స్ తో బరువు తగ్గించుకుని గ్లామర్ గా బుట్ట బొమ్మల్లా తయారవుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో వివాహం చేసుకున్న కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ తో ఎంజాయ్ చేస్తూనే సినిమాల పరంగా బిజీ అయ్యింది.
ఈ నెల మొదటి వారంలోనే కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ లు వివాహ వార్షికోత్సవాన్ని బ్యూటిఫుల్ గా జరుపుకున్నారు. అలా వన్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ చేసుకున్న కత్రినా కైఫ్ మళ్ళీ కెరీర్ లో బిజీ అయ్యేందుకు హాట్ ఫోటో షూట్స్ మొదలు పెట్టింది. గోల్డ్ కలర్ బ్యూటిఫుల్ డ్రెస్ లో కత్రినా ఎద అందాలను చూపిస్తూ చేయించుకున్న ఫోటో షూట్ ఇప్పుడు హాట్ హాట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానికన్నా ఎక్కువగా కత్రినా వేసుకున్న ఆ డ్రెస్ ఖరీదు అక్షరాలా రెండు లక్షలట. అది విన్న ఆమె అభిమానులు షాకవుతున్నారు. అందుకే ఆ రెండు లక్షల డ్రెస్ లో కత్రినా మెరుపులకి ముగ్దులవుతున్నారు.
పెళ్లయినా తగ్గేదేలే అంటూ కత్రినా గ్లామర్ షో చూస్తే అనిపించకమానదు. మరి ఇద్దరి బిడ్డల తల్లి కరీనా కపూర్ ఎప్పుడూ ఈ గ్లామర్ షో చుట్టూనే ఉంటుంది. రీసెంట్ గా తల్లయిన అలియా భట్ బేబీ ని అత్తకి అప్పజెప్పి అప్పుడే యోగ సెషన్ కి బయలుదేరింది. హీరోయిన్స్ అంతేమరి.. అటు ఫ్యామిలీ, ఇటు కెరీర్ రెండిటిని హ్యాండిల్ చేస్తూ మిగతా లేడీస్ కి ఇన్స్పైరింగ్ గా నిలుస్తున్నారు.