Advertisementt

బిగ్ బాస్ 6: కీర్తినా? శ్రీ సత్యనా?

Fri 16th Dec 2022 12:17 PM
bigg boss 6,sri sathya,keerthy  బిగ్ బాస్ 6: కీర్తినా? శ్రీ సత్యనా?
Bigg Boss 6: Sri Sathya vs Keerthy బిగ్ బాస్ 6: కీర్తినా? శ్రీ సత్యనా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ ప్రేక్షకులకి చెప్పిన నాగార్జున అది బుధవారమే జరుగుతుంది అంటూ అందరిలో ఇంట్రెస్ట్ ని పెంచేశారు. కానీ బుధవారం మాత్రం ఎలాంటి ఎలిమినేషన్ జరగకపోయేసరికి ప్రేక్షకులు మా ఓటింగ్ కి విలువ లేదా అంటూ మండి పడుతున్నారు. ఇంతలోపులో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటి సభ్యులని అందరిని వరసగా నిలబెట్టి ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది, అంటూ ఎవరికి షాకిచ్చాడు.

హౌస్ లో ఉన్నవారికి ఇప్పటివరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతున్నట్టుగా తెలియదు, ఆరుగురిని బాగ్స్ సర్దుకోమని చెప్పారు. ఇక వరసగా నించుని టాప్ 5 లో ఉండేందుకు ఎవరు అనర్హులో మీ అభిప్రాయం ప్రకారం ఒకరిని ఇంటి నుండి పంపేందుకు పేరు చెప్పమనగానే శ్రీహన్ రోహిత్ పేరు చెప్పాడు, కీర్తి ఆది రెడ్డి పేరు చెప్పింది. రోహిత్ శ్రీహన్ పేరు చెప్పగా, శ్రీ సత్య కీర్తి పేరు చెప్పింది. అది రెడ్డి కీర్తి పేరు చెప్పగా, రేవంత్ ఎవరి పేరు చెప్పాడో హోల్డ్ లో పెట్టి సస్పెన్స్ క్రియేట్ చేసారు.

బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ టాప్ 5 లో ఉండేందుకు అనర్హురాలిగా కీర్తి పేరు చెప్పారు. కానీ ప్రేక్షకుల ఓటింగ్ అభిప్రాయం ప్రకారం టాప్ 5 కి చేరుకోకముందే ఎలిమినేట్ అవుతున్న ఇంటి సభ్యులు అని చెప్పగానే.. అందరిలో అది సత్యనే అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు. ఓటింగ్ లో లీస్ట్ లో శ్రీ సత్య ఉంది. హౌస్ మేట్స్ ఓట్స్ లో కీర్తికి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. సో ఈ రోజు శుక్రవారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు అంటే కీర్తినా? లేదంటే శ్రీ సత్యనా? బయటికి వెళ్ళేది అనేది తెలిసిపోతుంది.

Bigg Boss 6: Sri Sathya vs Keerthy:

Bigg Boss 6 telugu mid week elimination promo highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ