మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు పెళ్ళైన పదేళ్లకు పేరెంట్స్ గా మారబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు చరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నప్పటికీ మెగా ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకి శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి. అయితే ఈ విషయం తెలిసాక ఉపాసన రీసెంట్ గా అత్తారింటి నుండి పుట్టింటికి వెళ్ళింది.
అక్కడ నానమ్మ, అమ్మమ్మ, తల్లి దీవెనలు తీసుకుకోగా.. వారంతా ఉపాసన తో కలిసి గడిపిన ఆనంద క్షణాలను ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్న ఉపాసన తన అత్తగారిని మిస్ అవుతున్నట్లుగా పోస్ట్ పెట్టింది. తల్లి, పిన్ని, అమ్మమ్మ, నాన్నమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పిక్స్ దిగిన ఉపాసన వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మిస్ యు అత్తమ్మా అంటూ కొణిదెల సురేఖ అక్కడ లేని లోటు తెలుస్తున్నట్టుగా ఆమె తెలియజేసింది. ఇక ఉపాసన ప్రెగ్నెన్సీ అన్న విషయం తెలిసాక మొదటిసారి ఇలా పుట్టింటి ఫ్యామిలీతో కనిపించిన ఉపాసన పిక్స్ ని షేర్ చేస్తూ లైక్స్ కొడుతూ మెగా ఫాన్స్ హడావిడి చేస్తున్నారు.
ఇటు మెగా ఫ్యామిలి సెలెబ్రేషన్స్, అటు కామినేని వారి సెలెబ్రేషన్స్ తో ఉపాసన ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మరి పదేళ్ల తర్వాత శుభవార్త అంటే ఇలానే ఉంటుంది.