రెజినా కాసాండ్రా ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది. ఆచార్య లో ఓ స్పెషల్ సాంగ్ తో మెరిసిన రెజినా ఒకటి రెండు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నా.. పెద్దగా సందడి లేదు. అదలా ఉంటే రెజినా గతంలో మెగా హీరోతో లవ్ ఉంది అని ప్రచారం జరిగింది. మెగా హీరోతో సినిమాలు చేసిన ఆమె.. ఆతనితో ప్రేమలో పడింది అంటూ ప్రచారం జరిగినా అదంతా జస్ట్ రూమర్ అని కొట్టిపారేశారు వాళ్ళు, తాజాగా మరోసారి రెజినా టాలీవుడ్ హీరోతో ప్రేమాయణం నడుపుతుంది అనే టాక్ మరోసారి సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.
అదే సందీప్ కిషన్ తో. రెజినా-సందీప్ కిషన్ ముందు నుండి ఫ్రెండ్స్. ఈ మధ్యన రెజినా బర్త్ డే రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు శుభాకాంక్షలు పాప.. ఐ లవ్ యు అని, నీకు అంతా మంచే జరగకాలంటూ రెజినా తో కలిసి క్లోజ్ గా ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఐ లవ్ యు చెప్పాడు సందీప్ కిషన్.. అది నిజం. రెజినా తో సందీప్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే రెజినా సందీప్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం షురూ అయ్యింది.
మరి ఈ డేటింగ్ లో నిజమేమిటో అనేది సందీప్ కానీ, రెజినా కానీ బయటపెడితేనే కానీ.. ఈ రూమర్స్ కి అడ్డు కట్ట వెయ్యడం సాధ్యం కాదు.