బిగ్ బాస్ సీజన్ 6 లో అస్సలు ప్రేక్షకులు ఓట్స్ పరిగణనలోకి తీసుకోకుండా యాజమాన్యం కంటెస్టెంట్స్ ని ఇంటిదారి పట్టించింది అంటూ ఎప్పటినుండో సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. ఆడియన్స్ ని ఓట్స్ వెయ్యమని చెప్పినవాళ్లు ఓట్స్ ని లెక్కించకుండా తమకి నచ్చని వారిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నారని అంటున్నారు. అలాగే సూర్య, గీతూ ల ఎలిమినేషన్స్ తో పాటుగా బాలాదిత్య, రీసెంట్ గా ఫైమా ఇంకా గత వారం ఎక్సపెక్ట్ చెయ్యని ఇనాయ ఎలిమినేట్ అవడం చూసిన ప్రతి ఒక్కరూ ఇదే మాట.
కానీ నాగార్జున మాత్రం ఎలిమినేషన్ అనేది కేవలం ప్రేక్షకుల ఓట్స్ వలనే అంటూ గొప్పగా చెప్పి.. ఈ బుధవారం మిడ్ ఎలిమినేషన్ ఉంటుంది, అది కూడా మీ ఓటింగ్ తోనే అంటూ బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే బుధవారం ఎవరిని ఎలిమినేట్ చెయ్యకుండా సైలెంట్ గా ఉండిపోయారు. బుధవారం వరకు శ్రీ సత్య కానీ, రోహిత్ కానీ ఎలిమినేట్ అవుతారని ఓటింగ్ పోల్స్ చెబుతుంటే.. ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా బిగ్ బాస్ టాప్ 6 ని ఫినాలే వరకు ఉంచేసినట్లుగా తెలుస్తుంది.
ఇక శుక్రవారం ఉదయం నుండి బిగ్ బాస్ లైవ్ ఆపేసారు. ఎందుకంటే శుక్ర, శనివారాల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం స్పెషల్ డాన్స్ పెరఫార్మెన్స్, అలాగే సాంగ్స్, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ని రెడీ చేసి.. వాటిని షూట్ చేస్తూ లైవ్ ఆపేసారు. ప్రెజెంట్ ఇంకా హౌస్ లో టాప్ 6 మెంబెర్స్ ఉన్నారు. గురువారం నైట్ వరకు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందిగా అంటూ బిల్డప్ ఇచ్చి బుల్లితెర ఆడియన్స్ ని బిగ్ బాస్ పక్కదారి పట్టించడం ఆడియన్స్ కి అస్సలు నచ్చడం లేదు.