Advertisementt

బాలయ్య- పవన్ కళ్యాణ్ బ్లాస్టింగ్ ఎపిసోడ్

Thu 15th Dec 2022 09:38 PM
pawan kalyan,balakrishna,unstoppable 2  బాలయ్య- పవన్ కళ్యాణ్ బ్లాస్టింగ్ ఎపిసోడ్
Unstoppable 2: Pawan Kalyan blast with Balakrishna బాలయ్య- పవన్ కళ్యాణ్ బ్లాస్టింగ్ ఎపిసోడ్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆహా వారు సీజన్ 2 ని మరింత స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే ప్రాసెస్ లో పొలిటికల్ టచ్ ఇచ్చారు. అయితే ఎందుకో ఆహా వారి ప్లాన్ బెడిసికొట్టింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 లో పొలిటికల్ ఎపిసోడ్స్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో అరవింద్ గారు మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్. ప్రస్తుతం ప్రభాస్ అన్ స్టాపబుల్ గ్లిమ్ప్స్ తో ఆడియన్స్ లో అంచనాలు కాదు పిచ్చెక్కిస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూసెయ్యాలా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో కలగజేసారు.

ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ కి రావడం కన్ ఫర్మ్ అయ్యింది. ఈ సీజన్ సెకండ్ ఎపిసోడ్ తోనే బాలయ్య.. త్రివిక్రమ్ తో కలిసి పవన్ రాకని కన్ ఫర్మ్ చేసినా.. ఇంకా ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ తాండవం చేస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ కి ఖచ్చితంగా వస్తారని, ఆయన ఫ్రీ గా ఉన్న టైమ్ లో బాలయ్య ని పిలిచి ఈ షో చేయించాలని అరవింద్ డిసైడ్ అయ్యారట. పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో బిజీ కాబట్టి.. త్రివిక్రమ్ ఎప్పుడంటే అప్పుడే రెడీ. పవన్ కళ్యాణ్ కోసం ఆయన వెయిటింగ్. 

ఇప్పటికే ఆహా టీం పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరుపుతుంది అని, వచ్చే ఏడాది కొత్త సంవత్సరం అందులోను సంక్రాంతికి బాలయ్య-పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఎపిసోడ్ షూట్ కూడా ఈ ఏడాది చివరికల్లా కంప్లీట్ చేసేయాలని చూస్తున్నారట. మరి ఈ బ్లాస్టింగ్ ఎపిసోడ్ ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో అని మెగా-నందమూరి ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Unstoppable 2: Pawan Kalyan blast with Balakrishna:

Experience Power Star Unstoppable Power

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ