Advertisementt

లోకేష్ తో KGF స్టార్ యశ్

Thu 15th Dec 2022 07:42 PM
rocking star yash,nara lokesh  లోకేష్ తో KGF స్టార్ యశ్
Yash Meets Nara Lokesh లోకేష్ తో KGF స్టార్ యశ్
Advertisement
Ads by CJ

నారా లోకేష్ తో కెజిఫ్ స్టార్ హీరో యశ్ మీటింగ్.. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ విషయం. కెజిఫ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టి క్రేజీ స్టార్ గా మారిన యశ్ టిడిపి నేత, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని కలవడం ఇంట్రెస్టింగ్ విషయం కాకపోతే ఇంకేమిటి.  రాజకీయాలతో బిజీగా ఉంటున్న లోకేష్-యశ్ ఎక్కడ, ఎలా, ఎందుకు మీటయ్యారో అనే క్యూరియాసిటీ అటు ప్రేక్షకుల్లో ఇటు టిడిపి కార్యకర్తల్లో మొదలయ్యింది. ఈ రోజు గురువారం లోకేష్-యశ్ కలవడం అటు రాజకీయంగానూ, ఇటు సినిమా పరంగాను హాట్ టాపిక్ అయ్యింది.

యశ్-లోకేష్ ల మీటింగ్ అరగంటకు పైగా జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ భేటీకి అసలు కారణాలు బయటికి తెలియకపోయినా వీరి భేటీ మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే రాజకీయంగా ఎలాంటి టచ్ లేని యశ్, సినిమాలతో సంబంధం లేని నారా లోకేష్ కలవడం వింతే కదా.. అందుకే వీరి భేటీ వివరాలు బయటికి వచ్చేవరకు అందరిలో పలు రకాల అనుమానాలు మొదలు అవ్వడం ఖాయంగా కనబడుతుంది.

ఏది ఏమైనా నారా లోకేష్ ని కన్నడ హీరో యశ్ మీటయిన ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. 

Yash Meets Nara Lokesh:

Rocking Star Yash Meets Nara Lokesh 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ