Advertisementt

సమంతని తోక్కేసిన కాజల్

Thu 15th Dec 2022 06:12 PM
kajal aggarwal,samantha  సమంతని తోక్కేసిన కాజల్
Kajal Aggarwal beats Samantha సమంతని తోక్కేసిన కాజల్
Advertisement
Ads by CJ

సమంత నాగ చైతన్య తో పెళ్లయ్యాక కూడా సినిమాల విషయంలో ఎక్కడా తగ్గలేదు, గ్లామర్ పరంగా మరింత హాట్ గా డేరింగ్ పాత్రలతో రెచ్చిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సీరీస్ లో బోల్డ్ గా ను నటించి ఆకట్టుకుంది. ఈమధ్యనే యశోద తో సక్సెస్ అందుకున్న సమంత, మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా చెప్పింది. అయినప్పటికీ పెళ్ళయ్యి, బాబుని కని మళ్ళీ నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ సమంతని తొక్కేసింది. కాజల్ అగర్వాల్ 2020 లో వివాహం చేసుకుంది. ఓ బిడ్డకి తల్లయ్యింది. అయితే గూగుల్ సెర్చింగ్ లో మాత్రం నెటిజెన్స్, విడాకులతో సఫర్ అయ్యి, కెరీర్ లో నిలదిక్కుకున్న సమంతని పక్కనపెట్టేసి కాజల్ అగర్వాల్ ని వెతికేసారు. 

2022 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో గూగుల్ 2022 సెర్చ్ రిజల్ట్స్ వివరాలు వెల్లడించింది. అందులో కాజల్ అగర్వాల్ మొదటి స్థానం చేజిక్కించుకోగా, సమంత రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలోకి క్రేజీ గా నేషనల్ క్రష్ రష్మిక వచ్చేసింది. సోషల్ మీడియాలో రష్మిక చేసే పోస్ట్ లు.. గూగుల్ లో సెర్చ్ చేస్తూ నెటిజెన్స్ రశ్మికకి మూడో స్థానం కట్టబెట్టారు. ఇక నాలుగో స్థానంలో మిల్కి బ్యూటీ తమన్నా ఉంది. తర్వాత రీసెంట్ గా పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా తల్లయిన నయనతార సౌత్ నుండి ఐదో ప్లేస్ లోకి చేరింది.

ఈమధ్యన అస్సలు పబ్లిక్ అప్పీరియన్స్ లేని అనుష్క ఆరో స్థానంలో ఉండగా.. బుట్టబొమ్మ పూజ హెగ్డే ఏడో స్థానంలోకి వచ్చింది. తర్వాత స్థానాల్లో కీర్తి సురేష్, సాయి పల్లవి తొమ్మిదో స్థానంలో, రకుల్ ప్రీత్ సింగ్ పదో స్థానంతో సరిపెట్టుకుంది. 

Kajal Aggarwal beats Samantha :

Most searched south Indian actresses on google 2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ