Advertisementt

పుష్ప 3 కి అన్నేళ్ల సమయమా..

Thu 15th Dec 2022 04:47 PM
pushpa 3,sukumat  పుష్ప 3 కి అన్నేళ్ల సమయమా..
Crazy update on Pushpa 3 పుష్ప 3 కి అన్నేళ్ల సమయమా..
Advertisement
Ads by CJ

పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయిన ఏడాదికే పుష్ప పార్ట్ 2 రిలీజ్ అంటూ ఊరించిన పుష్ప టీమ్ పుష్ప ద రూల్ షూట్ ని ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది. డిసెంబర్ 17 2021 లో పుష్ప పాన్ ఇండియా మూవీ గా విడుదలైన అన్ని భాషల్లో ఆడియన్స్ ని ఊపేసింది. సుకుమార్ పుష్ప సినిమా అనుకున్నప్పుడు అది ఒక కథగానే మొదలయ్యింది. కానీ కథ పెరిగిపోవడంతో.. పుష్ప షూటింగ్ సగం అయ్యాక దానిని రెండు పార్టులుగా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ఎనౌన్స్ చేసారు. పార్ట్ వన్ మొత్తం ఓ ఎర్రచందనం కూలి పుష్ప రాజ్ గా ఎలా ఎదిగాడో చూపించారు.

పుష్ప 2 లో అదే పుష్పరాజ్ విజయ గర్వంతో ఓ పోలీస్ వాడి చేతిలో ఓడిపోయి పతనమవడం చూడబోతున్నామనే ప్రచారం జరుగుతుండగా.. పుష్ప పార్ట్ 3 పై కూడా టీమ్ క్యూరియాసిటీ పెంచుతుంది. పుష్ప పార్ట్ 3 ఖచ్చితంగా ఉంటుందట. మూడో పార్ట్ లో పుష్ప రాజ్ ఓడిపోయి.. మళ్ళీ రాజుగా ఎదిగి ఈసారి తనని తొక్కే ఛాన్స్ ఎవరికీ ఇవ్వకుండా అంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటాడట. అదే పార్ట్ 3 కథ అంటున్నారు. 

అయితే పుష్ప పార్ట్ 3 పుష్ప 2 రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ చేశాకే అంటే ఓ నాలుగైదేళ్లు గ్యాప్ తోనే పార్ట్ 3 పట్టాలెక్కుతుందట. పుష్ప పార్ట్ 3 కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా పలు దేశాల్లో విడుదల చెయ్యాలని సుక్కు-బన్నీ ఆలోచనట. అలాగే సుకుమార్ కూడా మరో హీరోతో సినిమా పూర్తి చేసుకుని కూల్ గా పుష్ప పార్ట్ 3 సెట్స్ లోకి వెళతారట.

Crazy update on Pushpa 3 :

Pushpa 3 update

Tags:   PUSHPA 3, SUKUMAT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ