Advertisementt

ట్రోల్స్ కి భయపడి ప్రెగ్నెన్సీ విషయం దాచేసా

Thu 15th Dec 2022 01:54 PM
shriya saran,shriya pregnancy  ట్రోల్స్ కి భయపడి ప్రెగ్నెన్సీ విషయం దాచేసా
Shriya Reveals Why She Kept Her Pregnancy A Secret ట్రోల్స్ కి భయపడి ప్రెగ్నెన్సీ విషయం దాచేసా
Advertisement
Ads by CJ

హీరోయిన్స్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాళ్ళయ్యాకా వారు నటనకు ఫుల్ స్టాప్ పెడతారేమో అనే అనుమానంలో అభిమానులు ఉంటారు. ఇక హీరోయిన్స్ ప్రెగ్నెంట్ అయ్యారంటే.. వాళ్ళు బరువు పెరిగిపోయి అంద విహీనంగా తయారవుతారేమో అనే ఆతృతలో వాళ్ళని ట్రోల్ చేసేవాళ్ళు లేకపోలేదు. కాజల్ అగర్వాల్ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ బేబీ బంప్ ఫొటోస్ రివీల్ చేస్తూ ప్రెగ్నెంట్ అంటే లేడీస్ బరువు పెరుగుతారు. అది సహజం, తల్లి అయ్యే ఆనంద క్షణాలని ఆస్వాదించాలి కానీ.. ట్రోల్ చేస్తున్నారని భయపడకూడదు, అంటూ అటు ట్రోల్స్ చేసేవారికి గట్టిగానే ఇచ్చిపడేసింది. 

అయితే హీరోయిన్ శ్రియ మాత్రం ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని దాచేసి కూతురు పుట్టిన కొద్ది నెలలకు తాను తల్లయ్యాను అంటూ షాకిచ్చింది. శ్రియ అసలు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది, ఎప్పుడు తల్లయ్యిందో తెలియక చాలామంది షాకయ్యారు. రీసెంట్ గా తన ప్రెగ్నెన్సీ విషయం ఎందుకు దాయాల్సి వచ్చిందో శ్రీయ చెప్పింది. తాను ట్రోల్స్ కి భయపడ్డాను అని, నా కూతురు రాధా నా కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా తల్లి అయ్యే మధుర క్షణాలను ఆస్వాదించాలనుకున్నాను. 

ప్రెగ్నెంట్ టైమ్ లో ఎవరైనా బరువు పెరుగుతారు. కానీ హీరోయిన్స్ విషయంలో దానిని సాధారణంగా తీసుకోరు. నేను బరువు పెరిగాను. ఆ సమయంలో నేను నా ప్రెగ్నెన్సీ విషయాన్ని షేర్ చేస్తే అభిమానులు, మీడియా నన్ను ట్రోల్ చేస్తారని భయపడి నా విషయాన్ని ఎవరితో పంచుకోలేకపోయాను. బిడ్డని మోసే సమయంలో ఎలాంటి ఒత్తిడికి, ట్రోల్స్ కి గురువద్దనే కారణంగానే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచేసాను అంటూ శ్రియ అప్పటి విషయాలను చెప్పుకొచ్చింది.

Shriya Reveals Why She Kept Her Pregnancy A Secret:

Shriya Saran revealed the secret of hiding her pregnancy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ