బిగ్ బాస్ సీజన్ 6లో చివరి వారమంతా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ జర్నీ, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పార్టీ అంటూ ఎంజాయ్ చేస్తారనుకుంటే.. ఉన్న ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తామని చెప్పి ఆసక్తిని క్రియేట్ చేసారు. అందులో ఆది రెడ్డి, శ్రీ సత్య, కీర్తిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటూ గత రెండు రోజులుగా బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ చెబుతూ వచ్చాయి. అయితే కీర్తి కానీ సత్య కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవుతారని ఫిక్స్ అయ్యారు. బుధవారం రాత్రి ఆ ఎపిసోడ్ వస్తుంది అని ఆడియన్స్ కూడా ఆశపడ్డారు. కానీ బుధవారం రాత్రి ఎపిసోడ్ కేవలం శ్రీహన్, కీర్తిలా బిగ్ బాస్ జర్నీని మత్రమే చూపించారు.
ఇక ఈ వారం మిడిల్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. బిగ్ బాస్ లైవ్ పరిశీలిస్తే మాత్రం రేవంత్, రోహిత్, ఆది రెడ్డి, కీర్తి, శ్రీహన్ మాత్రం హౌస్ లో కనిపిస్తున్నారు. అంటే శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు. హౌస్ లో మొదటి రెండు వారాల్లో గేమ్ ఆడని శ్రీ సత్య తర్వాత నాగార్జున క్లాస్ కి మారింది. అందంగా కనబడినా.. అబ్బాయిలతో పోటీ పడింది.
అయితే కీర్తి ఇంకా కొంతమంది విషయంలో శ్రీ సత్య వెటకారం వలన ఆమె గ్రాఫ్ తగ్గింది. కానీ ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత శ్రీ సత్య వెటకారం తగ్గించి గేమ్ మీద ఫోకస్ పెట్టడంతో హౌస్ మేట్స్ కూడా అంచనా వెయ్యలేని స్టేజ్ కి ఆమె చేరుకుంది. స్ట్రాంగ్ గా మారకముందు శ్రీ సత్యని ఎలిమినేట్ చెయ్యకుండా స్ట్రాంగ్ అయిన వారిని ఎలిమినేట్ చేసారని చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు శ్రీ సత్య స్ట్రాంగ్ అయ్యి హౌస్ నుండి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే టాప్ 5 నుండి జస్ట్ మిస్ అయ్యింది.