విక్రమ్ తో పాన్ ఇండియా రేంజ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్.. ఆ సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. విక్రమ్ సక్సెస్ అయ్యాక ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈమధ్యన కాస్త అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్ పూర్తిగా కోలుకుని బిగ్ బాస్ తమిళ్ హోస్ట్ గాను, ఇండియన్ 2 షూటింగ్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ డ్యూయెల్ రోల్ చేస్తున్న ఇండియన్ 2 షూటింగ్ ప్రస్తుతం చెన్నై లోని ఓ స్టూడియోలో వేసిన సెట్ లో జరుగుతుంది.
కమల్ హాసన్ వృద్ధుడుగాను, యంగ్ గాను రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అంటే అచ్చం భారతీయుడు మూవీలో కమల్ ఎలా ఉంటారో అలానే ఉండబోతున్నారు. ఇప్పటికే ఇండియన్ 2 లో కమల్ హాసన్ ఓల్డ్ అవతార్ లుక్ ఆకట్టుకుంది. ఈ వృద్ధుడి గెటప్ కోసం కమల్ హాసన్ చాలా కష్ట పడుతున్నారట. అంటే మేకప్ వెయ్యడానికే గంటల గంటల సమయం పడుతుందట. ఒన్స్ మేకప్ వేసాక కమల్ నోరు కూడా తెరవలేక ఇబ్బంది పడుతుండడంతో ఆయన కేవలం పళ్ళ రసాలతోనే సరిపెట్టుకుంటున్నారట.
90 ఏళ్ళ వయసు వాడిలా కమల్ కనిపిస్తారట. ఆ గెటప్ కోసం ప్రోస్థటిక్ మేకప్ వాడడంతో కమల్ ఆ గెటప్ లో ఉన్న సమయంలో నోరు తెరిచి ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడంతో కేవలం జ్యుస్ లతో కడుపునింపుకుంటున్నారట. ఈ చిత్రం లో కమల్ కి జోడిగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ లు నటిస్తున్నారు.