ప్రస్తుతం సంక్రాంతి సినిమాల జాతర మొదలైపోయింది. నందమూరి బాలకృష్ణ వీర సింహ రెడ్డి, చిరంజీవి వాల్తేర్ వీరయ్యల జోరు రోజు రోజుకి ఎక్కువైపోతోంది. సంక్రాంతి బరిలో జనవరి 12 న బాలయ్య దిగుతుంటే.. ఒక రోజు లేటైనా లేటెస్ట్ గా జనవరి 13 న చిరు దిగుతున్నారు. ప్రమోషన్స్ కూడా పోటా పోటీగా మొదలైపోయాయి. ఇప్పటికే వీరసింహ రెడ్డి ఫస్ట్ సింగిల్, వాల్తేర్ వీరయ్యల ఫస్ట్ సింగిల్ విడుదలకాగా.. రేపు గురువారం వీరసింహ రెడ్డి సెకండ్ సింగిల్ శృతి హాసన్ తో బాలయ్య దిగిపోతున్నారు. మరి బాలయ్య వస్తుంటే చిరు ఆగుతారా.. ఆగరు.
చిరు ప్రస్తుతం యూరప్ లో ఉన్నారు. అక్కడి నుండి ఓ వీడియో బైట్ వదిలారాయన. హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నా.. డిసెంబర్ 12 న నేను శృతి హాసన్ కలిసి చేసిన సాంగ్ కంప్లీట్ అయ్యింది.. దాని లొకేషన్స్ ని మీరు లుక్కెయ్యండి అంటూ -8 డిగ్రీల మంచు, చలిలో మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి కష్టపడ్డామంటూ మెగాస్టార్ చిరు అక్కడ సాంగ్ చిత్రకరణ ముచ్చట్లతో పాటుగా.. త్వరలోనే రిలీజ్ కాబోయే సెకండ్ సింగిల్ ని లీక్ చేసేసారు.
శృతి హాసన్ బ్యూటిఫుల్ సారీ లుక్ తో పాటుగా.. మెగాస్టార్ మెస్మరైజ్ చేసే లుక్ ని జస్ట్ అలా .. నువ్వు శ్రీదేవైతే.. నేనా చిరంజీవంట.. నాకే నాకే సాంగ్ ని లీక్ చేసారు. దేవిశ్రీ పాడిన ఈ సాంగ్ చూస్తుంటే సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. మరి బాలయ్య అఫీషియల్ గా సాంగ్ తో వస్తుంటే.. చిరుకి ఆత్రం ఆగక మేకర్స్ కన్నా ముందే ఈయన సాంగ్ ని లీక్ చేసారు.